ETV Bharat / sitara

త్వరగా 'ఆచార్య' పూర్తి.. 20 నుంచి సెట్స్​లోకి చిరు! - ఆచార్య సినిమా షూటింగ్ కబుర్లు

'ఆచార్య' చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్​ 20 నుంచి చిరు షూటింగ్​లో పాల్గొనున్నారు.

Acharya_chiru
'ఆచార్య' షూటింగ్​ త్వరగా ముగించే పనిలో చిత్రయూనిట్!
author img

By

Published : Nov 16, 2020, 3:59 PM IST

మెగాస్టార్​ చిరంజీవి 'ఆచార్య' షూటింగ్​ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరితగతిన దానిని ముగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే నవంబరు 20 నుంచి చిరు సెట్స్​లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

లాక్​డౌన్​ ప్రభావంతో మార్చి నుంచి 'ఆచార్య' చిత్రీకరణ నిలిచిపోయింది. ఇటీవలే తిరిగి ప్రారంభించారు. అప్పుడు చేసిన వైద్యపరీక్షల్లో చిరుకు కొవిడ్ పాజిటివ్​గా తేలడం వల్ల ఆయన లేకుండానే సన్నివేశాల్ని తీస్తున్నారు. డాక్టర్ల పొరపాటు వల్లే ఆయనకు వైరస్​ సోకినట్లు రిపోర్ట్ ఇచ్చారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

'ఆచార్య'కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు 40 శాతమే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. వచ్చే ఏడాది వేసవికి థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్, మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

ఇదీ చదవండి:చిరు లేకుండానే 'ఆచార్య' షూటింగ్ షురూ!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.