చిన్న సినిమాలకు తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో చిత్రం చేరింది. అదే నిఖిల్ హీరోగా నటించిన 'అర్జున్ సురవరం'. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హీరో చిరంజీవి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.
జర్నలిజం, విద్యావ్యవస్థ తదితర అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. సామ్ సీఎస్ సంగీతమందించాడు. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహించాడు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: జార్జ్‌రెడ్డి గురించి అప్పుడే విన్నా: మెగాస్టార్ చిరంజీవి