అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుంచి చెన్నై టి.నగర్‌లోని స్వగృహానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం రేపటి వరకు మారుతీరావు పార్థివ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి సినీ నటుడు చిరంజీవి, హీరోయిన్ సుహాసిని నివాళులర్పించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. "సాహిత్యం గురించి సాహితీ వేత్తల గురించి, గొప్ప గొప్ప రచనల గురించి ఆయన చెబితేనే నాకు తెలిసింది. ఆయన నాకు ఒక గురువులాంటి వారు. అలాంటి గొల్లపూడి మారుతీరావుగారు దూరమవడం తీరని లోటు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చేయడానికి ఏడాది ముందే ఆయనతో నాకు పరిచయం ఉంది. ఇక్కడే ఇదే ఇంటి ఆవరణలో తరచూ మేము కూర్చొని మాట్లాడుకునేవాళ్లం. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి.. రొమాన్స్‌కి కేథరిన్.. పోరుకి శ్రీకాంత్..!