ప్రముఖ హాస్య నటుడు, వ్యాఖ్యత అలీని.. మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. చిరుతో పాటు 'మా' అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. గురువారం ఉదయం మృతి చెందిన అలీ అమ్మ జైతున్ బీబీ భౌతికకాయానికి వీరు నివాళుల్పించారు. స్వస్థలం రాజమహేంద్రవరంలో ఆమె మరణించారు.
సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. తల్లి మరణవార్తతో వెంటనే హైదరాబాద్ వచ్చాడు. ఈరోజు సాయంత్రం జైతున్ బీబీ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇది చదవండి: నటుడు అలీకి మాతృవియోగం