మెగాస్టార్ చిరంజీవి.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను(Chiranjeevi stalin) కలిసి, కాసేపు ముచ్చటించారు. ఆయన రాజనీతిజ్ఞుడిగా ఎదుగుతున్నారని ప్రశంసించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.
"పార్టీలకు అతీతంగా స్టాలిన్ పథకాలు అందిస్తున్నారు. ఆయన దార్శనికత, అంకితభావం ఉన్న ప్రజానేత. కరోనా వేళ స్టాలిన్ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించింది" అని చిరు ప్రశంసించారు.
త్వరలోనే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య'(Chiranjeevi Acharya movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత 'లూసిఫర్' రీమేక్(గాడ్‌ఫాదర్) 'భోళా శంకర్', బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
ఇదీ చూడండి: chiranjeevi kapil dev: కపిల్‌తో చిరు-ప్యాలెస్‌లో సందడి