లాక్‌డౌన్ సడలింపులతో మళ్లీ జీవితాలు షురూ అవుతున్నాయి. అయితే చిత్రసీమ మామూలు స్థితికి చేరుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇప్పట్లో థియేటర్లకి అనుమతులు లభించే పరిస్థితి లేదు. అందుకే చిత్రసీమ కనీసం చిత్రీకరణలనైనా మొదలు పెట్టాలనే ప్రయత్నంలో ఉంది. చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అవి పునః ప్రారంభమైతేనే కార్మికులకి ఉపాధితో పాటు చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది.
మరి ఇప్పటి పరిస్థితుల్లో చిత్రీకరణలు సాధ్యమేనా? సెట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనుమతుల కోసం ప్రభుత్వాలను సంప్రదిద్దామా? అనే విషయాల గురించి చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, నటులు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు సమావేశం కానున్నారు. ఒక నిర్ణయానికొచ్చాక పరిశ్రమ తరఫున ప్రభుత్వాల్ని సంప్రదించే యోచనలో ఉన్నట్టు సమాచారం. నాలుగైదు రోజులుగా ఆ సమావేశం కోసం కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సమావేశం జరగబోతున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి.. ఆస్కార్-2021 వాయిదా.. ఫిబ్రవరిలో లేనట్లే!