ETV Bharat / sitara

కర్నూల్​ ఎయిర్​పోర్ట్​కు 'ఉయ్యాలవాడ' పేరుపై చిరు హర్షం - uyyalawada narasimha reddy airport kurnool

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు మెగాస్టార్​ చిరంజీవి. ఇది స్వాతంత్య్ర సమరయోధుడికి దక్కిన అసలైన గౌరవంగా పేర్కొన్న చిరు.. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను తాను పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

chiru
చిరు
author img

By

Published : Mar 25, 2021, 4:44 PM IST

Updated : Mar 25, 2021, 4:58 PM IST

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం పట్ల ప్రముఖ సినీనటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి ఇలాంటి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

  • Heartened & Overjoyed at the Hon'ble CM @ysjagan 's announcement naming #KurnoolAirport after the Firstever Freedom Fighter of India #UyyalavadaNarasimhaReddy Much deserved recognition to the greatest patriot & unsung Hero.Was fortunate & honored to play the great soul on screen

    — Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కర్నూలులో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనపై స్పందించిన చిరంజీవి.. ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. దీనిని స్వాతంత్య్ర సమరయోధుడికి దక్కిన అసలైన గౌరవంగా పేర్కొన్న చిరు.. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథలో నటించడం, ఆయన పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని.. మెగాస్టార్‌ కథానాయకుడిగా ‘సైరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం చిరు..‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: చిరకాల మిత్రుడితో చిరంజీవి సిక్కిం టూర్

Last Updated : Mar 25, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.