ETV Bharat / sitara

chiranjeevi kapil dev: కపిల్​తో చిరు-ప్యాలెస్​లో సందడి - లూసిఫర్

దిగ్గజ క్రికెటర్ కపిల్​ దేవ్​ హైదారాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను కలుసుకున్న మెసాస్టార్ చిరంజీవి.. దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

chiranjeevi kapildev
మెగాస్టార్‌ చిరంజీవి
author img

By

Published : Aug 29, 2021, 11:23 PM IST

హైదరాబాద్​ను సందర్శించారు టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌. ఆయనను ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ. ఈ ఫొటోలను ట్విట్టర్​లో పోస్టు చేశారు. తన పాత మిత్రుడిని కలవడం ఆనందాన్నిచ్చిందని అన్నారు.

chiranjeevi kapil dev
చిరు, కపిల్ దేవ్
chiranjeevi kapil dev
చిరుతో కపిల్​దేవ్​
chiranjeevi kapil dev
కపిల్​తో చిరు-ప్యాలెస్​లో సందడి

"చాలాకాలం తర్వాత చిరకాల మిత్రుడు కపిల్​దేవ్​ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా అద్భుతమైన ఫలక్​నుమా ప్యాలెస్​లో కలవడం మరింత ప్రత్యేకం. ఒక్కసారిగా వెనక్కు వెళ్లి నాటి స్మృతులను గుర్తుచేసుకున్నాం. మనకు తొలి ప్రపంచకప్​ సాధించిపెట్టిన కపిల్​దేవ్​.. నిజంగానే హరియాణా హరికేన్."

- మెగాస్టార్ చిరంజీవి

త్వరలోనే చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనితర్వాత లూసిఫర్​ రీమేక్​(గాడ్​ఫాదర్​'భోళా శంకర్', ​బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. కాగా, కపిల్​దేవ్​ జీవిత ఆధారంగా.. త్వరలోనే '83' సినిమా విడుదల కానుంది. ఇందులో రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి: 'మెగా'సిస్టర్స్​కు రామ్​చరణ్ రాఖీ​ ట్రీట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.