'దాసరి నారాయణరావుకు ప్రభుత్వం నుంచి సముచిత గుర్తింపు ఇప్పటికీ రాలేదు' అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. మంగళవారం (మే 4) దాసరి జయంతి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన సేవల్ని కొనియాడారు. 'దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి నా స్మృత్యంజలి. ఒకదానికి మించి మరొక చిత్రాన్ని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో అద్భుతంగా మలిచారు. నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల్ని పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమే! దాసరికి ప్రభుత్వ గుర్తింపు ఇప్పటికీ రాకపోవడం తీరని లోటు. ఇప్పటికైనా దాసరికి పద్మ పురస్కారం అందితే అది తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవమవుతుంది' అని పేర్కొన్నారు.
-
#RememberingALegend #DrDasari #PadmaForDrDasari pic.twitter.com/pasn1g2YWr
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#RememberingALegend #DrDasari #PadmaForDrDasari pic.twitter.com/pasn1g2YWr
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2021#RememberingALegend #DrDasari #PadmaForDrDasari pic.twitter.com/pasn1g2YWr
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2021
ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. రామ్చరణ్ కీలక పాత్ర పోషించగా.. పూజాహెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదీ చూడండి: దాసరి అందుకే చిత్రసీమకు 'గురు'వయ్యారు