మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం 'ఆచార్య'. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఇందులో చిరుతో పాటు రామ్‌చరణ్ నటించనున్నాడనే వార్తలు వచ్చాయి. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు మెగాస్టార్.
"ఆచార్య'లో చరణ్‌కు ఓ పాత్ర ఉన్నది వాస్తవమే. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్'తో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇందులో నటించడం వీలు పడుతుందో? లేదో? ఇప్పుడే చెప్పలేను. చెర్రీతో ఈ పాత్ర చేయించేందుకు, దర్శకుడు రాజమౌళిని ఒప్పించా. ఓ నెల పాటు చెర్రీని షూటింగ్ నుంచి ఇవ్వమని కోరా. అందుకు ఆయన అంగీకరించారు. ఈ చిత్రంలో నేను, చరణ్.. తండ్రి కొడుకులుగా కనిపించట్లేదు. అంతకు మించిన గురు శిష్యుల బంధం మాది" -మెగాస్టార్ చిరంజీవి, కథానాయకుడు
ప్రస్తుత పరిస్థితులు సరిదిద్దుకున్న తర్వాత, చరణ్ ఎప్పుడు సెట్స్‌లోకి అడుగుపెట్టేది అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ నటిస్తుంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదీ చూడండి : 'పాత్ర కోసం ఆ విషయంలో కాంప్రమైజ్ కావాలన్నారు'