ETV Bharat / sitara

మాస్ ​లుక్​లో చిరు.. 154వ సినిమా పోస్టర్​ రిలీజ్​ - చిరంజీవి కొత్త సినిమా

మెగాస్టార్​ చిరంజీవి-దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కనున్న సినిమా నుంచి అప్టేట్ వచ్చింది. ఆదివారం (ఆగస్టు 22) చిరు బర్త్​డే సందర్భంగా ఈ చిత్ర పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మాస్​లుక్​లో చిరు గెటప్​ అదిరిపోయింది.

chiru
చిరు
author img

By

Published : Aug 22, 2021, 4:15 PM IST

Updated : Aug 22, 2021, 4:46 PM IST

మెగాస్టార్​ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆదివారం(ఆగస్టు 22) ఆయన పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా అప్డేట్​ వచ్చేసింది.​బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'పూనకాలు లోడింగ్​.. త్వరలోనే షూటింగ్​ ప్రారంభం' అని వ్యాఖ్య జోడించింది. ఈ పోస్టర్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో చిరు మాస్​ లుక్​లో అదిరిపోయారు. ఇది ముఠామేస్త్రి సినిమాలోని లుక్​ను గుర్తుచేసేలా ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఒక అభిమానికి, స్టార్‌కి మధ్య అనుబంధమే ఈ కథకు స్ఫూర్తి అని చెప్పారు. ఈ చిత్రానికి 'వాల్తేర్​ వీరయ్య' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్​గా సోనాక్షి సిన్హాను తీసుకోవాలని భావిస్తున్నారట. చాలా ఏళ్ల తర్వాత చిరు తండ్రీ-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మించనుండగా.. దేవీ శ్రీ ప్రసాద్​ సంగీతం అందించనున్నారు.

ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంతో చిరంజీవి బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ సందడి చేయనుంది. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆ తర్వాత నటించనున్న మలయాళీ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్​కు 'గాడ్‌ ఫాదర్‌'(దర్శకుడు మోహన్‌ రాజా), తమిళ చిత్రం 'వేదాళం' రీమేక్​కు(మెహర్‌ రమేశ్‌) 'భోళా శంకర్‌' అనే పేర్లు ఖరారయ్యాయి.

ఇదీ చూడండి: చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేశ్.. స్పెషల్ వీడియో రిలీజ్

Last Updated : Aug 22, 2021, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.