ఓ చిన్నారి చేసిన పని మెగాస్టార్ చిరంజీవిని కదిలించింది. ఆ చిన్నారి తనలో మరింత స్ఫూర్తి రగిలించిందని స్వయంగా చిరంజీవి ఒక వీడియో పోస్టు చేశారు. కరోనా సోకి ఆక్సిజన్ లేక ఎదురుచూస్తున్న వారి కోసం చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. కాగా.. అన్షి అనే చిన్నారి జూన్ 1న తన పుట్టినరోజు సందర్భంగా దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు.
-
What a beautiful gesture Anshi!! I am so touched.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
You are a wonderful girl. God Bless you!! #AnshiPrabhala #ChiranjeeviOxygenBanks @Chiranjeevi_CT @AlwaysRamCharan pic.twitter.com/VTnQkHNDDP
">What a beautiful gesture Anshi!! I am so touched.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2021
You are a wonderful girl. God Bless you!! #AnshiPrabhala #ChiranjeeviOxygenBanks @Chiranjeevi_CT @AlwaysRamCharan pic.twitter.com/VTnQkHNDDPWhat a beautiful gesture Anshi!! I am so touched.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2021
You are a wonderful girl. God Bless you!! #AnshiPrabhala #ChiranjeeviOxygenBanks @Chiranjeevi_CT @AlwaysRamCharan pic.twitter.com/VTnQkHNDDP
"పి.శ్రీనివాస్, హరిణి దంపతుల కూతురు అన్షి ప్రభాల. తన దగ్గరున్న డబ్బుతో పాటు తన ఈ పుట్టినరోజు వేడుకల కోసం దాచుకున్న మొత్తాన్ని కూడా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం విరాళంగా ఇచ్చింది. తన చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరమని ఆ చిన్నారి అంటోంది. ఆమె ఆలోచనకు, మంచి మనసుకు, ఆమె వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకు నేను నిజంగా ముగ్ధుడినైపోయా. అన్షి స్పందన నా హృదయాన్ని తాకింది. నాకు మరింత ప్రేరణనిచ్చింది. తన కలలన్నీ నిజం కావాలని, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులను అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అన్షి. హ్యాపీ బర్త్ డే. లవ్ యూ డార్లింగ్" అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Pawan Kalyan: పవర్‌స్టార్‌కు ఇష్టమైన వంటకాలివే!