ETV Bharat / sitara

సుశాంత్​ మరణించిన నెలకు మాజీ ప్రియురాలి స్పందనిదే! - anikta first post after sushant death

బాలీవుడ్​ హీరో సుశాంత్​ చనిపోయిన నెల రోజుల తర్వాత మాజీ ప్రియురాలు అంకిత లోఖండే ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. తన ఇంట్లోని పూజ గదిలో దేవున్ని ప్రార్థిస్తూ.. సుశాంత్​ను 'దేవుని బిడ్డ'గా పేర్కొంది.

'Child of God' reads Ankita Lokhande's first post after month of Sushant Singh Rajput's death
సుశాంత్​ మరణించిన నెలకు మాజీ ప్రియురాలు స్పందన
author img

By

Published : Jul 14, 2020, 6:27 PM IST

Updated : Jul 14, 2020, 8:01 PM IST

సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​​ మరణించి ఇప్పటికి నెలరోజులు పూర్తయినా.. ఇంకా సినీ నటులు, అభిమానులు అతని జ్ఞాపకాలకు దూరం కాలేకపోతున్నారు. యువ హీరో చనిపోయిన తర్వాత మాజీ ప్రియురాలు అంకిత లేఖండే కనీసం సోషల్​మీడియాలోనైనా ఏం స్పందిచలేదు. అయితే తాజాగా ఈ నటి.. తన ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆధ్యాత్మికతతో కూడిన పోస్టు చేసింది.

నేటితో సుశాంత్​ మరణించి నెలరోజులైన నేపథ్యంలో.. ఇంట్లోని పూజగదిలో దేవున్ని ప్రార్థిస్తూ అతడిని 'భగవంతుడి బిడ్డ'గా ఇన్​స్టాలో రాసుకొచ్చింది.

సుశాంత్​, అంకిత 2016లో విడిపోవడానికి ముందు ఆరేళ్లపాటు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఏక్తా కపూర్​ టీవీషో పవిత్ర రిస్తా సెట్స్​లో కలుసుకున్నారు. ఈ కార్యక్రమం సుశాంత్​కు స్టార్​డమ్​ సంపాదించేందుకు సాయపడింది.

జూన్​ 14న సుశాంత్​ సింగ్​ ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకొని చనిపోయాడు. పోస్ట్​మార్టం నివేదికలోనూ అతని మృతికి ఆత్మహత్యే కారణమని నిర్ధరణ అయ్యింది. సుశాంత్​ మరణం అనంతరం.. అంకిత నటుడి కుటుంబాన్ని పరామర్శించింది.

ఇదీ చూడండి:'సుశాంత్​ చెప్పలేనంత వేదన మిగిల్చాడు'

Last Updated : Jul 14, 2020, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.