ETV Bharat / sitara

చైతూ నాకు పూర్తి వ్యతిరేకం: సమంత - naga chaitanya samantha

సామాజిక మాధ్యమాలకు తన భర్త హీరో నాగచైతన్య ఎందుకు దూరంగా ఉంటాడో హీరోయిన్​ సమంత వివరించింది. ఈ విషయంలో చైతూ తనకు పూర్తి వ్యతిరేకమని చెప్పింది.

Chay
చైతూ
author img

By

Published : Sep 22, 2020, 5:30 AM IST

స్టార్​ హీరోయిన్​ సమంత.. నిత్యం సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె​ భర్త, హీరో నాగచైతన్య మాత్రం దానిలో అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవల మాట్లాడిన సామ్.. సామాజిక మాధ్యమాల వినియోగంలో చైతూ తనకు పూర్తి వ్యతిరేకమని చెప్పింది.

""సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడంపై చైతూ నాకు పూర్తిగా వ్యతిరేకం. ఇందులో ఉండటాన్ని పెద్దగా ఇష్టపడడు. నేను ఎప్పుడైనా ఓ ఫొటో దిగినప్పుడు పొరపాటున అందులో అతని చేయి కనిపించినా.. దాన్ని పోస్ట్​ చేసేముందు అతడి అనుమతి తీసుకుంటాను. ఎందుకంటే వ్యక్తిగత జీవితం గురించి పంచుకునే విషయంపై ప్రతిఒక్కరికీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వాటిని నేను గౌరవిస్తాను"

-సమంత, టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్

ప్రస్తుతం 'ది ఫ్యామిలీ మ్యాన్​' వెబ్​సిరీస్​ రెండో భాగంలో నటించింది సమంత. చైతూ, శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో 'లవ్​స్టోరీ' సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత విక్రమ్ కె కుమార్​ 'థ్యాంక్యూ' చిత్రంలో కనిపించనున్నారు.

ఇదీ చూడండి కొత్త జేమ్స్​బాండ్​ దొరికేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.