కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం 'చావు కబురు చల్లగా'. లావణ్య త్రిపాఠి కథానాయిక. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టాడు కార్తికేయ.
నటుడు 'రంగస్థలం' మహేశ్‌తో కలసి హైదరాబాద్‌లో సందడి చేశాడు కార్తికేయ. స్వయంగా అతడే సినిమా వాల్ పోస్టర్ అంటించి, రైతు బజార్‌లో వ్యాపారులతో ముచ్చటించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. "మార్చి 19న మీ బస్తీ బాలరాజ్ వస్తున్నాడు.. మీ అభిమాన థియేటర్లలో" అని మహేశ్ చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. "ప్రేక్షకులంతా చావు కబురు చల్లగా సినిమా చూసి మీ బాలరాజ్‌ని, సినిమాకు పనిచేసిన అందర్నీ ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు కార్తికేయ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అలాగే చిత్రబృందం క్రికెట్ మ్యాచ్ ఆడి వీక్షకుల్ని కనువిందు చేశారు. ఈ మ్యాచ్‌లో హీరోహీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి, దర్శకుడు అనుదీప్ ఇంకా మిగిలిన యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్‌బిజోయ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.