ETV Bharat / sitara

ఛార్మికి త్వరలో పెళ్లి.. స్పందించిన ముద్దుగుమ్మ - ఛార్మి విజయ్ దేవరకొండ మ్యారేజ్

తనకు పెళ్లి జరగనుందనే వార్తల్ని తోసిపుచ్చింది నటి, నిర్మాత ఛార్మి. జీవితంలో పెళ్లి అనే పొరపాటును ఎప్పటికీ చేయనని ఓ ప్రకటన విడుదల చేసింది.

Charmme denied all the rumours circulating on her marriage
ఛార్మి
author img

By

Published : May 8, 2021, 10:08 PM IST

Updated : May 9, 2021, 5:58 AM IST

నటి, నిర్మాత ఛార్మి.. త్వరలో పెళ్లి చేసుకోనుందని గత కొద్దిరోజులగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన ఈమె.. వాటిని కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లేనని తేల్చింది.

Charmme marriage
ఛార్మి ప్రకటన

ప్రస్తుతం కెరీర్​లో అత్యుత్తమ దశలో ఉన్నానని చెప్పిన ఛార్మి.. ఇప్పుడున్న జీవితంతో ఆనందంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుని తప్పు చేయనని ప్రకటన విడుదల చేసింది.

పూరీ జగన్నాథ్​తో కలిసి ఈమె.. విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' నిర్మిస్తోంది. పాన్​ ఇండియా కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా ప్రభావంతో సెప్టెంబరులో రావాల్సిన ఈ చిత్ర విడుదల వాయిదా పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Charmme denied all the rumours on her marriage

Last Updated : May 9, 2021, 5:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.