టాలీవుడ్ హీరో గోపీచంద్ త్వరలో 'చాణక్య'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం.. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. సెప్టెంబరు 2న టీజర్ విడుదల చేయనుంది చిత్రబృందం.
మెహరీన్ హీరోయిన్గా నటించింది. ఈ హీరోతో ఇంతకు ముందు 'పంతం' సినిమాలో తెరను పంచుకుందీ భామ. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కీలకపాత్రలో మెరవనుంది. తిరు దర్శకత్వం వహించాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. టీజర్‌తో పాటే సినిమా విడుదల ఎప్పుడు అనేది ప్రకటించనుంది చిత్రబృందం.
ఇది చదవండి: 'చాణక్య' కోసం రఫ్ లుక్‌లో గోపీచంద్