టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.
నేడు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. డిఫరెంట్ యాస పలుకుతూ ఆకట్టుకున్నాడు కార్తికేయ. ఇందులో శవాల్ని తీసుకువెళ్లే బండి డ్రైవర్‌గా కనిపిస్తున్నాడీ హీరో. ఇతడికి తల్లిగా సీనియర్ నటి ఆమని కనిపించింది. టీజర్ చూస్తుంటే కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">