ETV Bharat / sitara

'ఎన్ని తరాలైనా బాలును మర్చిపోలేరు'

గాన గంధర్వుడు ఎస్పీ బాలుకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించింది. చెన్నైలో ఏర్పాటు చేసిన సంతాప సభకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలుతో తమకున్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

SPB
ఎస్పీ బాలు
author img

By

Published : Oct 1, 2020, 8:24 AM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న దక్కేలా దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌ కోరారు. 'పాడుతా తీయగా' కార్యక్రమం ద్వారా ఎస్పీ బాలు ఎంతోమంది చిన్నారులను గాయనీగాయకులుగా తీర్చిదిద్దారని తెలిపారు.'స్వరాభిషేకం'తో అందర్నీ సంగీత కడలిలో ముంచెత్తారని కీర్తించారు. బుధవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాపసభ జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్​ బాలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

SPB
ఎస్పీ బాలు సంతాప సభ

ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు కార్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ గౌరవమివ్వడం ఎస్పీబీని చూసే నేర్చుకున్నారని అన్నారు. కమల్‌హాసన్‌ వీడియో ద్వారా తన సందేశాన్ని పంపించారు. "ఆరంభంలో ఆయన నాకు బాలు సర్‌.. ఆ తర్వాత 'అన్నయ్య' అయ్యారు. ఎన్ని తరాలైనా బాలును మరిచిపోలేరు" అని చెప్పారు.

సంగీతం ద్వారా ప్రేమాభిమానాలను చాటి చెప్పారని విజయ్ సేతుపతి అన్నారు. బాలసుబ్రహ్మణ్యం తనకు గొప్ప గురువని గాయని చిత్ర చెప్పారు. అనంతరం బాలు బాల్య స్నేహితులు సుబ్బారావు, మురళి మాటలు అందర్నీ కంటతడి పెట్టించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.