ETV Bharat / sitara

డెస్టినేషన్ వెడ్డింగ్ ఎట్ బీచ్ సిటీ.. ట్రెండ్ గురూ! - చైసామ్ వెడ్డింగ్ గోవా

డెస్టినేషన్​ వెడ్డింగ్​కు సెలబ్రిటీలు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆహ్లాదకరమైన లొకేషన్లలో అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గుచూపుతారు. అలాగే బీచ్​లు ఉన్న సిటీలను ఎక్కువ మంది ఎంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కూడా దక్షిణ ముంబయిలోని అలీబాగ్​లో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో బీచ్​ టౌన్​లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సెలబ్రిటీ జంటలపై ఓ లుక్కేద్దాం.

Celebrities who picked beach destination for Wedding
డెస్టినేషన్ వెడ్డింగ్ ఎట్ బీచ్ సిటీ.. ట్రెండ్ గురూ!
author img

By

Published : Jan 22, 2021, 6:06 PM IST

సెలబ్రిటీల పెళ్లి అంటే కెమెరాలన్నీ అటువైపే ఉంటాయి. వారు ఎవరిని వివాహం చేసుకోబోతున్నారు? వేడుక ఎక్కడ జరగనుంది? ఎవరెవరు హాజరవుతున్నారు? వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే మరింత ఉత్సాహం వస్తుంది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్​ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి నటాషా దలాల్​ను గోవాలో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బీచ్​ సిటీస్​లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సెలబ్రిటీ జంటలెవరో చూద్దాం.

వరుణ్ ధావన్-నటాషా దలాల్

హీరో వరుణ్​ ధావన్​, ఫ్యాషన్​ డిజైనర్​ నటాషా దలాల్​ వివాహం.. ప్రస్తుతం బాలీవుడ్​లో హాట్​టాపిక్​గా మారింది. జనవరి 24(ఆదివారం)న ముంబయిలోని అలీబాగ్​ రిసార్ట్స్​లో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఈ పట్టణం బీచ్​లకు చాలా ఫేమస్. సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.

Celebrities who picked beach destination for Wedding
వరుణ్ ధావన్-నటాషా దలాల్

చైసామ్

పర్యాటకుల స్వర్గధామమైన గోవాలో నాగచైతన్య-సమంతల వివాహం జరిగింది. గోవాలోని స్టార్ హోటల్ 'డబ్ల్యు'లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీరి వివాహ వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిపారు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేడుక పూర్తి చేశారు.

నాగ చైతన్య, సమంత

కునాల్ కపూర్-నైనా బచ్చన్

'రంగ్ దే బసంతి' నటుడు కునాల్ కపూర్​ వివాహం నైనా బచ్చన్​తో సీషెల్స్​ ఐలాండ్​లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి బచ్చన్ కుటుంబంతో పాటు పలువురు బంధుమిత్రులు హాజరయ్యారు.

అనిత-రోహిత్ రెడ్డి

'నువ్వు నేను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిత-రోహిత్ రెడ్డిల వివాహం గోవాలో ఘనంగా జరిగింది.

యువరాజ్ సింగ్-హెజిల్ కీచ్

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ప్రేయసి హెజిల్ కీచ్​ను గోవాలో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి బంధుమిత్రులతో పాటు పలువురు క్రికెటర్లు హాజరయ్యారు.

ఇవీ చూడండి: బర్త్​డే స్పెషల్: మహేశ్​తో నమ్రత బ్యూటిఫుల్​ పిక్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.