సాగర తీరాన జీవిత సత్యాల్ని వెతుక్కుంటున్న బుట్టబొమ్మ ఒకరు.. వంద కేజీల బరువెత్తడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కొంటెపిల్ల మరొకరు. పల్లెటూరి సీతాకోక చిలుకల్లా కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న ముద్దుగుమ్మలు మరికొందరు. సామాజిక మాధ్యమాల వేదికగా కథానాయికలు చేస్తున్న అలర్లి నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యామ్ చిత్రీకరణలో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే.. తాజాగా సముద్ర తీరంలో సేదతీరుతున్న ఓ చక్కటి చిత్రాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా సముద్రం చెబుతున్న పాఠాలు అంటూ తన ఫొటోకి ఓ ఆసక్తికర వ్యాఖ్య జతచేసింది. మనందరం ఎవరికి వారు ప్రత్యేకమైన గులకరాళ్ల లాంటి వాళ్లమే. కానీ, అందరం ఒకే సముద్రం నుంచి వచ్చాం అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది పూజా. ఈ చిత్రంలో ఆమె సముద్రపు ఒడ్డున రంగురంగుల గులకరాళ్లు ఏరుకుంటూ కనిపించింది. కన్నడ కస్తూరి రష్మిక 100కేజీల బరువెత్తడమే లక్ష్యంగా జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా జిమ్‌లో భారీ బరువులు ఎత్తుతున్న తన వీడియోను అభిమానులతో పంచుకుంది. నీకు సాధించాలని ఉంటే.. వెళ్లి అందుకో’ అంటూ ఆ వీడియోకి ఓ వ్యాఖ్యను జత చేసింది. ఆమె త్వరలోనే అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సెట్‌లోకి అడుగుపెట్టబోతుంది.
ఇన్నాళ్లు తనదైన బోల్డ్ పెర్ఫామెన్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో ఆర్డీఎక్స్ బాంబులు పేల్చింది.. పాయల్ రాజ్‌పూత్. ఇప్పుడు అనగనగా ఓ అతిథితో తనలోని మరో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి తన కొత్త లుక్ ఒకటి ట్విటర్ వేదికగా పంచుకుంది. ఈ పోస్టర్‌లో ఆమె అచ్చమైన పల్లె పడుచులా చాలా క్యూట్‌గా దర్శనమిచ్చింది. ఇక ఈ మధ్య హాట్ హాట్ ఫొటో షూట్లతో తనలోని కొత్త కోణాల్ని విభిన్నంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది నటి రాశీ ఖన్నా. తాజాగా ఇదే తరహాలో మరో కొత్త లుక్‌తో నెటిజన్లను పలకరించింది. చీర కట్టులో తన ఒంపు సొంపుల్ని వయ్యారంగా ఒలికిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
హీరోల సరికొత్త లుక్‌లు అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి. వారి హెయిర్‌స్టెయిల్, డ్రెస్సింగ్ గురించి చర్చలు మొదలవుతుంటాయి. అందుకే హీరోలు ఏ మాత్రం అవకాశం వచ్చినా.. తమ అభిమానులను మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. సోషల్‌మీడియా ద్వారా విజయ్‌దేవరకొండ, శర్వానంద్, రామ్ తమ నూతన లుక్‌లతో పలుకరించారు.