ETV Bharat / sitara

సినిమా హిట్ అయితే పారితోషికం పెంచాల్సిందే! - పారితోషికం పెంచిన హీరోయిన్లు

సినిమా విజయం సాధిస్తే అందులో నటించిన హీరోహీరోయిన్లకు గుర్తింపు లభిస్తుంది. వారి శ్రమకు ఫలితమూ దక్కుతుంది. అయితే ఇలా హిట్​లు దక్కించుకుని, తమ తదుపరి చిత్రాలకు పారితోషికాన్ని పెంచేస్తున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. వారు ఎవరు? ఎంత పెంచారు?

సినిమా
సినిమా
author img

By

Published : Jun 6, 2020, 5:39 PM IST

ఎక్కువగా ఆర్జిస్తున్న సెలబ్రిటీల్లో బాలీవుడ్​ నటీనటులు ముందుంటారు. వారి పారితోషికాలూ ఘనంగానే ఉంటాయి. సక్సెస్​లో ఉన్న హీరోలకు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ కథానాయకులు ఒక్క హిట్​ పడగానే రెమ్యునరేషన్ పెంచుతుంటారు. అలా పారితోషికాలు​ హైక్ చేసిన వారు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

రణ్​బీర్ కపూర్-సంజు

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రణ్​బీర్ కపూర్​కు 'సంజు'తో భారీ విజయం దక్కింది. రాజ్​కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఇందులోని నటనకు రణ్​బీర్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ సినిమా విజయం తర్వాత ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచాడట రణ్​బీర్. రూ.3 నుంచి 6 కోట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కరీనా కపూర్
రణ్​బీర్ కపూర్

వరుణ్ ధావన్- జుడ్వా 2

సల్మాన్ ఖాన్ నటించిన 'జుడ్వా'కు కొనసాగింపుగా తెరకెక్కిన సినిమా 'జుడ్వా 2'. వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. గతేడాది వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఫలితంగా వరుణ్ రెమ్యునరేషన్​ పెంచేశాడు. ఆ తర్వాత నుంచి ఒక్కో సినిమాకు దాదాపు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

జుడ్వా 2
జుడ్వా 2

దీపికా పదుకొణె- పద్మావత్

'పద్మావత్' సినిమాలో నటించినందుకు రూ.13 కోట్ల పారితోషికం అందుకుంది హీరోయిన్ దీపికా పదుకొణె. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన రణ్​వీర్ సింగ్, షాహిద్ కపూర్​లు.. చెరో రూ.10 కోట్లు మాత్రమే తీసుకున్నారు. అయితే ఈ హిట్​తో దీపిక మరోసారి రెమ్యునరేషన్ పెంచేసిందట. బయోపిక్​ '83' కోసం రూ.14 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీపికా పదుకొణె
దీపికా పదుకొణె

ప్రియాంక చోప్రా- ద స్కై ఈజ్ పింక్

కొంతకాలం బ్రేక్ తీసుకున్న ప్రియాంక చోప్రా.. 'ద స్కై ఈజ్ పింక్'​తో మళ్లీ బాలీవుడ్​లో మెరిసింది. అయితే ఈ సినిమాతో వచ్చిన లాభాల్లో ప్రియాంక వాటా తీసుకుందని సమాచారం. అది తన రెగ్యులర్ పారితోషికం కంటే ఎక్కువని తెలుస్తోంది. హాలీవుడ్​లో 'క్వాంటికో' సిరీస్​తో పాటు, నిక్​ జోనస్​ను పెళ్లి చేసుకోవడం వల్లే బాలీవుడ్​కు కాస్త విరామం వచ్చింది.

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా

రణ్​వీర్ సింగ్- పద్మావత్

పైన చెప్పినట్లుగా రణ్​వీర్ సింగ్ 'పద్మావత్' కోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన విజయం తర్వాత తన పారితోషికం పెంచాడట. అయితే కపిల్​దేవ్ బయోపిక్​ '83' కోసం రూ.13 కోట్లు అందుకున్నట్లు సమాచారం.

గల్లీ బాయ్
గల్లీ బాయ్

కరీనా కపూర్- వీర్ ది వెడ్డింగ్

ముద్దుగుమ్మ కరీనా కపూర్ వరుస విజయాలతో జోరుమీదుంది. 'జబ్​ వుయ్ మెట్'​ నుంచి 'ఉడ్తా పంజాబ్' వరకు పలు వైవిధ్య పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే 'వీర్ ది వెడ్డింగ్' విజయం తర్వాత ఈ భామ రెమ్యునరేషన్​ను పెంచిందట. కరణ్​ జోహర్ తీస్తున్న భారీ ప్రాజెక్ట్ 'తఖ్త్'​ కోసం ఏకంగా 50 శాతం పారితోషికం పెంచినట్లు సమాచారం.

కరీనా కపూర్
కరీనా కపూర్

విక్కీ కౌశల్-యురి

'యురి- ద సర్జికల్ స్ట్రైక్'​ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విక్కీ కౌశల్. బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన ఈ చిత్ర విజయంతో విక్కీకి పలు ప్రకటనల్లోనూ నటించే అవకాశాలు వచ్చాయి. అయితే తాను చేయబోయే కొత్త ప్రాజెక్టులకు రూ. 3-4 కోట్లు ఎక్కువగా తీసుకుంటున్నట్లు సమాచారం.

విక్కీ కౌశల్
విక్కీ కౌశల్

ఆయుష్మాన్ ఖురానా- డ్రీమ్ గర్ల్

సామాజిక సమస్యలు, రోజూ జరిగే సంఘటనల్నే కథలుగా ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఆయుష్మాన్ ఖురానా. వరుస విజయాలతో బాలీవుడ్​లో జోరు చూపిస్తున్నాడు. 'డ్రీమ్ గర్ల్'​ సినిమా తర్వాత పారితోషికాన్ని రూ.8 కోట్లు పెంచి మొత్తం రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.

డ్రీమ్ గర్ల్
ఆయుష్మాన్ ఖురానా

కార్తిక్ ఆర్యన్-సోనూ కీ టీటూ కీ స్వీటీ

బీ టౌన్​లో పేరు తెచ్చుకుంటున్న వర్తమాన హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. 'ప్యార్ కా పంచ్​నామా' సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 'సోనూ కీ టీటూ కీ స్వీటీ' విజయం తర్వాత కార్తిక్.. తన పారితోషికాన్ని పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం రూ.7 కోట్లు తీసుకుంటున్నాడట.

కార్తీక్ ఆర్యన్
కార్తీక్ ఆర్యన్

కంగనా రనౌత్- క్వీన్

'క్వీన్' రూపంలో కంగనా రనౌత్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇందులో నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఫలితంగా తన రెమ్యునరేషన్​ను పెంచిసింది. ప్రస్తుతం తీస్తున్న 'తలైవి' కోసం ఏకంగా రూ.24 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్​లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటిగా రికార్డు సృష్టిస్తుంది.

కంగనా రనౌత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.