ETV Bharat / sitara

డ్రగ్స్ కేసు: హీరోయిన్ ఇంట్లో అధికారుల సోదాలు

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కాని హీరోయిన్ రాగిణి ఇంటిపై సీసీబీ అధికారులు రైడ్ చేశారు. అనంతరం ఆమెను తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.

డ్రగ్స్ కేసు: హీరోయిన్ ఇంట్లో అధికారులు సోదాలు
హీరోయిన్ రాగిణి
author img

By

Published : Sep 4, 2020, 9:17 AM IST

Updated : Sep 4, 2020, 11:05 AM IST

కన్నడ చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. కేసు విచారణలో భాగంగా పలువురిని విచారిస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్​ అధికారులు.. బెంగళూరులోని హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంట్లో శుక్రవారం సోదాలు జరిపి, ఆమెను తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అంతకుముందు ఆమెను గురువారం విచారణకు హాజరు కావాలని సీసీబీ అధికారులు నోటీసులు పంపారు. కానీ రాగిణి అక్కడికి వెళ్లలేదు. సదరు కారణాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ క్రమంలో అధికారులు ఆమె ఇంటిపై రైడ్ చేశారు. రాగిణి ద్వివేది స్నేహితుడు రవిశంకర్, మరో నటి సంజనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరుకు డ్రగ్స్ ఎక్కువ మొత్తంలో సరాఫరా అవుతాయని భావిస్తున్న ఎన్​సీబీ అధికారులు, విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్ర ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్​ వాహనాలపై ఆకస్మిక దాడులు చేస్తున్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ ఇప్పటికే డ్రగ్ కార్టెల్ కింగ్​పిన్ అనిఖాతో పాటు సహాయకులు అనూప్, రవీంద్రన్​లను అరెస్టు చేసింది. వీరి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం కూడా చేసుకుంది. ఎన్​సీబీ పరిధిలో ప్రస్తుతం శాండల్​వుడ్​కు చెందిన ప్రముఖ నటీనటులతో పాటు సంగీత దర్శకులు ఉన్నారు.

Last Updated : Sep 4, 2020, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.