ETV Bharat / sitara

సుశాంత్​ కుటుంబ సభ్యులను ప్రశ్నించనున్న సీబీఐ!

author img

By

Published : Sep 29, 2020, 1:36 PM IST

సుశాంత్​ రాజ్​పుత్ మృతి కేసులో భాగంగా అతడి కుటుంబసభ్యులనూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారించనుందని సమాచారం. హీరో ఫ్యామిలీతో పాటు దిల్లీ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడిని ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.

CBI likely to question Sushant Singh Rajput's family
సుశాంత్​ కుటుంబసభ్యులను ప్రశ్నించనున్న సీబీఐ

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ అనుమానాస్పద మృతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేస్తోంది. ఈ కేసులో భాగంగా హీరో కుటుంబసభ్యులనూ సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. సుశాంత్​ తండ్రి, సోదరీమణులు, బావలతో పాటు దిల్లీ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడిని విచారించనున్నారని తెలుస్తోంది. సుశాంత్​ శవపరీక్ష రిపోర్టును ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఇప్పటికే సీబీఐకి సమర్పించినట్లు సమాచారం.

కేసు పక్కదోవ పట్టడం లేదు

సుశాంత్​ కేసులో సీబీఐ దర్యాప్తు నెమ్మదిగా సాగుతూ, పక్కదారి పడుతుందని హీరో తరఫు న్యాయవాది వికాస్‌, గతవారం ఆరోపించిన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ వివరణ ఇచ్చింది. ఈ మృతి కేసులో దర్యాప్తుపై ఇంకా ఎలాంటి తుది అభిప్రాయానికి రాలేదని సీబీఐ తెలిపింది. దీని వెనకున్న అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం వృత్తిపరమైన దర్యాప్తు కొనసాగుతోందని చెప్పిన ఆయన.. విచారణలో ఏ కోణాన్ని విస్మరించలేదని వివరణ ఇచ్చారు.

జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరి వేసుకుని చనిపోయాడు. అనంతరం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కొద్ది రోజులుగా డ్ర‌గ్స్​కు సంబంధించిన అంశం చర్చనీయాంశమైంది. దీంతో సుశాంత్​ కేసును పక్కన పెట్టి.. మాదక ద్రవ్యాలపై దృష్టి సారిస్తున్నారని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.