మాస్ మహారాజ్ రవితేజ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 'క్రాక్' చేస్తూనే రమేశ్ వర్మ దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ఈ చిత్రంలో ముద్దుగుమ్మ కేథరిన్ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుందట. రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా కనిపించనున్నారట.
