స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు అభిమానులున్నారు. అలాంటి ఈ పాట యూట్యూబ్‌లో మరో రికార్డు సాధించింది. ఈ ప్లాట్ఫామ్లో 500 మిలియన్ల వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది. అలాగే 3.3 మిలియన్ల లైక్స్తోనూ దూకుకెళ్తోంది.
-
#ButtaBomma video song touches 500 Million views & the celebrations continue to soar 🕺💃♥️
— Haarika & Hassine Creations (@haarikahassine) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
▶️https://t.co/c1bVIOikD9#AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @ArmaanMalik22 @ramjowrites @AlwaysJani #PSVinod @navinnooli @vamsi84 @adityamusic pic.twitter.com/glg1Tl4jiE
">#ButtaBomma video song touches 500 Million views & the celebrations continue to soar 🕺💃♥️
— Haarika & Hassine Creations (@haarikahassine) January 7, 2021
▶️https://t.co/c1bVIOikD9#AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @ArmaanMalik22 @ramjowrites @AlwaysJani #PSVinod @navinnooli @vamsi84 @adityamusic pic.twitter.com/glg1Tl4jiE#ButtaBomma video song touches 500 Million views & the celebrations continue to soar 🕺💃♥️
— Haarika & Hassine Creations (@haarikahassine) January 7, 2021
▶️https://t.co/c1bVIOikD9#AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @ArmaanMalik22 @ramjowrites @AlwaysJani #PSVinod @navinnooli @vamsi84 @adityamusic pic.twitter.com/glg1Tl4jiE
బన్నీ, పూజ జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తమన్ తన పాటలతో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశారు. మూవీ విడుదలకు ముందే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చిందంటే అందుకు కారణం ఈ సినిమా పాటలే. తమన్ సంగీతానికి అర్మాన్ మాలిక్ గాత్రం, అల్లు అర్జున్ స్టెప్పులు 'బుట్టబొమ్మ'కు ప్రాణం పోశాయి. ఈ పాటతో పాటు 'రాములో రాములో' కూడా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో కొనసాగుతోంది.
మేకింగ్ వీడియో
'బుట్టబొమ్మ' సాంగ్ వీడియో యూట్యూబ్‌లో 50 కోట్ల వీక్షణలు పొందిన సందర్భంగా ఈ పాట మేకింగ్ వీడియోను నెట్టింట షేర్ చేసింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">