స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్ట బొమ్మ' పాట టీజర్ విడుదలైంది. లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అర్మాన్ మాలిక్ ఈ గీతాన్ని పాడాడు. పూర్తి సాంగ్ ఈనెల 24న రానుంది.
ఈ సినిమాలో నుంచి ఇప్పటికే వచ్చిన 'రాములో రాములా', 'సామజవరగమన' పాటలు.. చెరో 100 మిలియన్ల వీక్షణలు సాధించడం విశేషం. మరి 'బుట్టబొమ్మ' ఇంకెన్ని రికార్డులు అందుకుంటోందో చూడాలి.
ఇందులో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తోంది. సుశాంత్, నవదీప్, టబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. వచ్చే నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'రాములో రాముల' పాటతో బన్నీ మరో సెంచరీ