స్టైలిష్ స్టార్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. త్వరలో నటించనున్న 'ఐకాన్ కనబడుటలేదు' సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. 'ఎమ్సీఏ'తో ఆకట్టుకున్న వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
![icon kanapduta ledu movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3035293_allu-arjun_chandu.jpg)
ఇదే కాకుండా మరో రెండు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడీ హీరో. త్రివిక్రమ్, సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. వీరిద్దరితోనూ మూడోసారి కలిసి పనిచేస్తున్నాడు అల్లు అర్జున్.
ఇది చదవండి: అల్లు- త్రివిక్రమ్ సినిమాలో మరో ఇద్దరు హీరోలు?