ETV Bharat / sitara

Prabhas: 'ప్రభాస్ సినిమాల కోసం పార్లమెంట్​లో బడ్జెట్'

Prabhas: పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ సినిమాల కోసం పార్లమెంట్​లో బడ్జెట్​ కేటాయించాలని సరదాగా వ్యాఖ్యానించారు నటుడు నవీన్ పొలిశెట్టి. 'రాధేశ్యామ్' ప్రీరిలీజ్ ఈవెంట్​ సందర్భంగా ఆయన సందడి చేశారు.

Prabhas
ప్రభాస్
author img

By

Published : Dec 24, 2021, 7:44 AM IST

Prabhas: సాధారణంగా సినిమాలకు ఫైనాన్సర్స్‌ ఉంటారని, ప్రభాస్‌ చిత్రాలకు మాత్రం ఫైనాన్స్‌ మినిస్టర్స్‌ ఉంటారని యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి అన్నారు. 'రాధేశ్యామ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హోస్ట్‌గా హాజరైన ఆయన ప్రభాస్‌ సినిమాల బడ్జెట్‌ గురించి మాట్లాడారు. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్‌'. పూజాహెగ్డే కథానాయిక నటించిన ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం రామోజీ ఫిల్మ్‌ సిటీలో అభిమానులే అతిథులుగా ముందస్తు విడుదల వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా నవీన్‌.. ప్రభాస్‌ సినిమాలు, బడ్జెట్‌ గురించి సరదాగా సంభాషించారు. "హెల్త్‌ కోసం రూ.500 కోట్లు, ఎడ్యుకేషన్‌కు రూ.500 కోట్లను కేటాయించినట్టే ఇకపై పార్లమెంట్‌లో ప్రభాస్‌ అన్న సినిమా కోసం రూ.2000 కోట్లు కేటాయించండి సర్‌" అంటూ సందడి చేశారు.

'రాధేశ్యామ్‌'తోపాటు ప్రభాస్‌ నటిస్తున్న 'ఆదిపురుష్‌', 'సలార్‌', 'ప్రాజెక్ట్‌ కె' (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతుండటం వల్ల నవీన్‌ ఇలా స్పందించారు. ఈ మాటలకు ప్రభాస్‌ సహా ఆయా చిత్రాల దర్శకులు నవ్వులు చిందించారు.

ఇదీ చూడండి:

'రాధేశ్యామ్​'లో లవ్​స్టోరీకి మించిన ట్విస్టులు: ప్రభాస్

ఫ్యాన్స్​ కోసం ప్రభాస్ 'రాధేశ్యామ్' చేశారు: పూజా హెగ్డే

ప్రభాస్ 'రాధేశ్యామ్' ట్రైలర్ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.