ETV Bharat / sitara

ఆరు నెలల తర్వాత 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి అప్​డేట్​! - రామ్​ చరణ్

దాదాపు ఆరు నెలల క్రితం మెగాపవర్​స్టార్​ రామ్​చరణ్​ పుట్టినరోజు సందర్భంగా టీజర్​ రిలీజ్​ చేసిన 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రబృందం.. ఇప్పటివరకు సినిమా గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్​డేట్​ను మంగళవారం ఇవ్వనున్నట్లు సోషల్​మీడియాలో ప్రకటించారు.

Breaking news: A New Update From RRR movie on tomorrow
ఆరు నెలల తర్వాత 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి అప్​డేట్​!
author img

By

Published : Oct 5, 2020, 5:14 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌.ఆర్‌.ఆర్‌). కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తోన్న ఈ సినిమా ఇదే నెలలో తిరిగి ప్రారంభం కానుందని సమాచారం.

  • Enough of our festival posts and your unparalleled creativity in taunting us for updates 😅😂

    Thanks for bombarding us with all your love. Time flew by, and finally the moment is here! Now, it’s our turn to entertain you... 🤗

    Stay tuned for tomorrow... 😉 #WeRRRBack #RRRMovie

    — 𝗥𝗥𝗥 𝗠𝗼𝘃𝗶𝗲 (@RRRMovie) October 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సినిమాకు సంబంధించిన అప్​డేట్​ను రేపు (మంగళవారం) ప్రకటించనున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించింది చిత్రబృందం. "ప్రతి పండగకు అడిగే అప్​డేట్​ల కోసం మీరు (అభిమానులు) మమ్మల్ని సృజనాత్మకంగా తిట్టిన తిట్లు ఇకచాలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. సమయం చాలా గడిచింది. ఇప్పుడు మిమ్మల్ని అలరించడం మా వంతు. రేపటి వరకు వేచి ఉండండి" అని పోస్ట్​ చేశారు.

రామ్​చరణ్​ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు టీజర్​ లాగా.. ఎన్టీఆర్​ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారా? అంటూ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఆరోగ్య నిబంధనలను పాటిస్తూ..

'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటీనటులందరూ ఈనెల పదవ తేదీ నుంచి హోటల్లోనే 14రోజుల పాటు క్యారంటైన్‌లోనే ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు షూటింగ్‌లో ఉండే ప్రతి వస్తువును శానిటైజ్‌ చేస్తూ.. సిబ్బందికి థర్మల్‌ స్క్రీనింగ్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనే ఏర్పాట్లను చిత్రబృందం చేస్తోందట. మొత్తం మీద అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్​లు సెట్స్ పైకి వెళ్లే సమయం ఆసన్నమైనందుకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానులు ఖుషిగా ఉన్నారు. ఇందులో ఆలియా భట్‌, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.