ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' రిలీజ్​.. బీటౌన్​ నిర్మాత అసంతృప్తి - రాజమౌళి వార్తలు

'ఆర్​ఆర్​ఆర్​' సినిమా విడుదల తేదీపై బాలీవుడ్​ నిర్మాత బోనీ కపూర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను నిర్మిస్తున్న 'మైదాన్​' రిలీజ్​ డేట్​ ఆరు నెలల ముందే ప్రకటించినా.. ఆ చిత్రానికి పోటీగా రాజమౌళి సినిమా రిలీజ్​ చేయడం సరికాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Boney Kapoor 'upset' about RRR-Maidaan clash
'ఆర్​ఆర్​ఆర్' రిలీజ్​.. బీటౌన్​ నిర్మాత అసంతృప్తి!
author img

By

Published : Jan 27, 2021, 3:22 PM IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌ డేట్ వివాదానికి తెరలేపింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల తేదీ పట్ల బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా తాను నిర్మించిన 'మైదాన్‌' చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్‌ 15న విడుదల చేయనున్నట్లు ఆరు నెలల ముందే ప్రకటించినప్పటికీ అదే నెలలో 13న 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు బోనీకపూర్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల గురించి స్పందించారు.

Boney Kapoor 'upset' about RRR-Maidaan clash
'ఆర్​ఆర్​ఆర్​' రిలీజ్​ పోస్టర్​

"నిజం చెప్పాలంటే రాజమౌళి సినిమా విడుదల పట్ల నేనెంతో అసంతృప్తిగా ఉన్నాను. ఇది అన్యాయం. 'మైదాన్‌' విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితమే ప్రకటించాను. అందరం ఒక్కటిగా ఉండి చిత్ర పరిశ్రమను కాపాడాల్సిన ఈ సమయంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ఇలా చేయడం నాకు నచ్చలేదు."

- బోనీ కపూర్​, బాలీవుడ్​ నిర్మాత

రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రను పోషిస్తున్నారు.

'మైదాన్' సినిమా రిలీజ్​ పోస్టర్​

మరోవైపు ప్రముఖ హైదరాబాదీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న 'మైదాన్‌'లో అజయ్‌దేవ్‌గణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అమిత్‌ రవింద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: అందుకే అక్టోబరు 13న 'ఆర్​ఆర్​ఆర్​'?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.