బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా శాలిన్.. ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం, ముంబయిలో తాను ఉంటున్న అపార్ట్మెంట్ 14వ అంతస్థు నుంచి దూకింది. అప్పుడే సమీప బోరివాలీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈమె మరణంపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ముందు దిశా శాలిన్.. ప్రముఖ హాస్యనటులు కపిల్ శర్మ, వరుణ్ గ్రోవర్‌లకు మేనేజర్‌గా పనిచేసింది.
'కై పో చే' చిత్రంతో తెరంగేట్రం చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు..'యంఎస్ ధోని' సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రానికి గానూ ఫిలింఫేర్ అవార్డునూ అందుకున్నాడు. ప్రస్తుతం 'దిల్ బెచేరా'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు సుశాంత్.
ఇవీ చదవండి: