Karan Johar Corona: బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌జోహార్ ఇంట్లో జరిగిన పార్టీ వల్ల బాలీవుడ్ ప్రముఖుల్లో కొందరికి కరోనా వైరస్ సోకిందంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన కరణ్.. ఆ వార్తలను ఖండించారు. తనతో పాటు తన కుటుంబంలో ఉన్న ప్రతిఒక్కరికీ నెగటివ్ వచ్చినట్లు చెప్పారు. 'ఎనిమిది మంది కలిస్తే అది పార్టీ కాదు, నా ఇల్లు కరోనాకు హాట్‌స్పాట్ కాదు' అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. తన ఇంటికి హాజరైన ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించారని అన్నారు.
ఇటీవల బీటౌన్ ప్రముఖుల్లో హీరోయిన్ కరీనా కపూర్, అమృతా అరోరా, సీమా ఖాన్, మహీప్ కపూర్ సహా మరో 8 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీరందరూ ఈ నెల 8న కరోనా నిబంధనలను ఉల్లంఘించి జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో ఎంజాయ్ చేశారని తెలిసింది. దీంతో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.. కరణ్ ఇంటి సభ్యులతో పాటు ఆయన నివాసముంటున్న బిల్డింగ్‌లో ఉన్నవారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా పార్టీకి హాజరైన వారి కుటుంబసభ్యులు కూడా టెస్టులు చేయించింది. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు చేశారు కరణ్.
ఇదీ చూడండి: 'సైఫ్ అలీ ఖాన్ ఎక్కడున్నారో కరీనా కుటుంబం చెప్పట్లేదు!'