ETV Bharat / sitara

బాలీవుడ్​ను పలకరిస్తోన్న కొత్త అందాలు! - కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట

బాలీవుడ్​ ప్రేక్షకుల్ని ఈ ఏడాది కొత్త అందాలు పలకరించనున్నాయి. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​లుగా గుర్తింపు పొందుతోన్న కీర్తి సురేశ్, రష్మికా మందానాలతో పాటు కత్రినా కైఫ్ సోదరి, శ్వేతా తివారి కూతురు ఈ జాబితాలో ఉన్నారు.

Bollywood Newcomers You Need to Keep an Eye
బాలీవుడ్​ను పలకరిస్తోన్న కొత్త అందాలు!
author img

By

Published : Mar 30, 2021, 9:32 AM IST

ప్రతి ఏడాది బారతీయ సినీ పరిశ్రమలోకి కొత్త అందాలు వస్తూనే ఉంటాయి. ఉత్తరాది, దక్షిణాది ఏ ప్రాంతమైనా కొందరు హీరోయిన్లు అరంగేట్రంలోనే అదరగొట్టిన వారు ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హోదా సంపాదించుకున్నారు. అలాగే ఈ ఏడాది కూడా కొంతమంది తారలు బాలీవుడ్​లో సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అరంగేట్ర సినిమాతోనే అదరగొట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021లో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.

ఇసాబెల్లే కైఫ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరిగా బాలీవుడ్​లో అడుగుపెట్టింది ఇసాబెల్లే కైఫ్. సూరజ్ పంచోలీ హీరోగా తెరకెక్కిన 'టైమ్ టూ డ్యాన్స్' చిత్రంతో ఈనెల ప్రారంభంలో థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం పుల్కిత్ సామ్రాట్​తో 'సుస్వాగతం ఖుషమ్​డీడ్'​, ఆయుష్మాన్ ఖురానాతో 'క్వాతా' వంటి చిత్రాల్లో నటిస్తోంది.

Isabelle Kaif
ఇలాబెల్లే కైఫ్

పాలక్ తివారి

ప్రముఖ టెలివిజన్ నంటి శ్వేతా తివారి కుతూరు పాలక్ తివారి. 'రోసీ: ద సాఫ్రాన్ చాప్టర్' అనే చిత్రంతో బాలీవుడ్​లో అరంగేట్రం చేయనుంది. ఇందులో వివేక్ ఒబేరాయ్ హీరో.

Shwetha, palak tiwary
శ్వేతా తివారీతో పాలక్ తివారీ

మానుషీ చిల్లర్

2019లో తన బాలీవుడ్ అరంగేట్రం గురించి వెల్లడించింది మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న 'పృథ్వీరాజ్' చిత్రంలో హీరోయిన్​గా చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ప్రిన్సెస్ సాన్యోగత పాత్రలో కనిపించనుంది మానుషి.

manushi
మానుషీ చిల్లర్

షాలినీ పాండే

'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే బాలీవుడ్​లో అడుగుపెట్టబోతుంది. రణ్​వీర్ సింగ్ హీరోగా యశ్​రాజ్ ఫిలింస్​ బ్యానర్​లో తెరకెక్కబోతున్న 'జయేశ్​భాయ్ జోర్దార్' చిత్రంలో హీరోయిన్​గా చేస్తోంది.

shalini
షాలినీ పాండే

రష్మికా మందనా

ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో దక్షిణాదిలో పాపులర్ అయిన రష్మికా మందనా బాలీవుడ్​లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ అమ్మడు సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతోన్న 'మిషన్ మజ్ను' చిత్రంలో హీరోయిన్​గా చేస్తోంది.

rashmika
రష్మిక

షర్వారీ వా

'బంటీ ఔర్ బబ్లీ 2' చిత్రంతో బీ టౌన్​లో అరంగేట్రం చేయనుంది షర్వారీ వా. ఇందులో సిద్దాంత్ చతుర్వేది, సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Sharvari Wagh
షర్వారీ వా

ప్రణీత సుభాష్

'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది దక్షిణాది స్టార్ ప్రణీత సుభాష్. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంతో పాటు 'హంగామా 2'లో సందడి చేయనుందీ భామ.

pranitha
ప్రణీత

కీర్తి సురేశ్

తమిళ్, తెలుగు, మలయాళంలో స్టార్ హీరోయిన్​గా వెలుగొందుతోంది కీర్తి సురేశ్. తాజాగా బాలీవుడ్​లోను తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తోన్న 'మైదాన్' చిత్రంలో హీరోయిన్​గా చేస్తోందీ ముద్దుగుమ్మ.

keerthy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.