బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్.. ఈ మధ్యే 'భారత్' సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. 2019 ప్రథమార్ధంలో అత్యంత ప్రజాకర్షణ పొందిన చిత్రంగా ఇది నిలిచింది. సామాజిక మాధ్యమాల గణాంకాల ఆధారంగా యూఎస్ స్కోర్ ట్రెండ్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
రెండవ స్థానంలో కరణ్ జోహార్ 'కలంక్', ఆ తర్వాతి స్థానాల్లో విక్కీ కౌశల్ 'ఉరి', అమితాబ్ 'బద్లా', అక్షయ్ కుమార్ 'కేసరి', మణికర్ణిక, థాక్రే, గల్లీబాయ్, టోటల్ ధమాల్ ఉన్నాయి. ఇటీవలే విడుదలైన షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్' 10వ స్థానంలో నిలిచింది.
భారతదేశంలోని 14 భాషల్లో సూమారు 6 వందలకు పైగా వార్తా మాధ్యమాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించాం. ఫేస్‌బుక్, ట్విట్టర్, ప్రింట్ పబ్లికేషన్స్, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు, ప్రసారాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు.. ఈ సమాచారం సేకరించిన వాటిలో ఉన్నాయి. -కౌల్, స్కోర్ ట్రెండ్స్ సహ వ్యవస్థాపకుడు
ఇది చదవండి: ఇన్నింగ్స్ చివర్లో వరణుడి రాక.. కివీస్@211/5