ETV Bharat / sitara

'తుఫాన్'​, 'ఫౌజీకాలింగ్​' విడుదల తేదీ ఖరారు - తుఫాన్​ రిలీజ్​ డేట్​

'తెల్లవారితే గురువారం' సినిమాలోని ఓ పాట విడుదలై శ్రోతలను బాగా ఆకట్టుకుంటోంది. కాగా, ఫర్హాన్​ అక్తర్​ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'తుఫాన్', షార్మాన్​ జోషి నటించిన 'ఫౌజీ కాలింగ్​' చిత్రాలు విడుదల తేదీ ఖరారయ్యాయి.

toofan
తుఫాన్​
author img

By

Published : Mar 10, 2021, 3:43 PM IST

బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తుఫాన్‌'. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మిహ్రా దర్శకుడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 21న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సరికొత్త పోస్టర్లను చిత్రబృందం పోస్ట్​ చేసింది. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌‌, పరేష్‌ రావల్‌, ఇషా తల్వార్‌ కీలకపాత్రలు పోషించారు.

బాలీవుడ్​ నటుడు షార్మాన్​ జోషి ప్రధాన పాత్రలో నటించిన 'ఫౌజీ కాలింగ్'​ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆర్యాన్​ సక్సెనా దర్శకత్వం వహించారు.

'మత్తు వదలరా'తో ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా హీరోగా నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిత్ర శుక్లా, మిషా నారంగ్‌ కథానాయికలు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'మనసుకి హానికరం అమ్మాయే' అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం విడుదల చేసింది. శ్రోతలను ఆకట్టుకునేలా ఉందీ గితం.

ఇదీ చూడండి: ఈ హైదరాబాదీ అమ్మాయి చాలా క్యూట్​ గురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.