బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ దాతృత్వన్ని చాటుకున్నాడు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధించారు. ఫలితంగా సినీ పరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోయాయి. వీటినే జీవనాధారంగా చేసుకుని బతుకు సాగిస్తున్న ఎందరో రోజువారీ వేతన కార్మికులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వారి సంక్షేమం కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తన వంతు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వచ్చాడని 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్' ప్రెసిడెంట్ బీఎన్ తివారీ చెప్పారు.
ఖాతాల ద్వారా
రోజువారీ కార్మికులకు సాయం చేయడానికి సల్మాన్‌కు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని తివారీ చెప్పారు. ఆ సంస్థకు చెందినవారు మూడు రోజుల క్రితం తమను కలిశారని అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్‌లో ఐదు లక్షల మంది ఉండగా.. అందులో 25 వేలమంది కార్మికులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ 25 వేల మంది బాగోగులను ఆ సంస్థ సభ్యులే చూసుకుంటామని చెప్పారు. కార్మికుల ఖాతాల్లోనే డబ్బులను నేరుగా జమ చేసేందుకు వీలుగా 25 వేల మందికి సంబంధించిన ఖాతా వివరాలను అడిగి తీసుకున్నారని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఛైర్మన్ తెలిపారు.
ఇదీ చదవండి: పన్నెండు పరాజయాలెదురైనా పట్టువదలని 'భీష్మ'