ETV Bharat / sitara

బాలీవుడ్​లో కరోనా.. అసలేం జరుగుతోంది? - కరోనా బాలీవుడ్

బిగ్​బీ అమితాబ్​ కుటుంబానికి కరోనా సోకడం కలకలం రేపింది. వీరితో పాటే మరికొందరు స్టార్స్ కొవిడ్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖ నటీనటులకు వైరస్ సోకినట్లు అసత్య వార్తలనూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

హిందీ చిత్రసీమలో ప్రాణాంతక కరోనా విజృంభణ
అమితాబ్ కుటుంబం
author img

By

Published : Jul 12, 2020, 6:21 PM IST

మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​తో పాటు ఆయన కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్​ రావడం బాలీవుడ్​లో చర్చనీయాంశమైంది. వీరిలో ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య ఉన్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు సినీ ప్రముఖులకు వైరస్​ సోకిందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. వీటిపైన స్పందిస్తున్న సదరు స్టార్స్.. ఆ విషయమై వివరణ ఇస్తున్నారు.

  1. శనివారం రాత్రి తనకు కరోనా సోకినట్లు బిగ్​బీ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. అనంతరం ఆయన కుమారుడు అభిషేక్​కు పాజిటివ్​గా తేలింది. -'బిగ్​ బీ, ​అభిషేక్​కు కరోనా- ఆసుపత్రికి తరలింపు'
  2. వీరితో పాటే బిగ్​బీ సతీమణి జయా బచ్చన్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యలకు పరీక్షలు చేయగా, నెగిటివ్​ వచ్చినట్లు ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ ఆదివారం ఉదయం వెల్లడించారు.
  3. ఐశ్వర్యతో పాటు ఆమె కుమార్తె వైరస్​ బారినపడ్డట్లు మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే.. ఆదివారం మధ్యాహ్నం ట్విట్టర్​లో పంచుకుని, వెంటనే దానిని డిలీట్ చేసేశారు. - 'ఐశ్వర్యా రాయ్​తో పాటు ఆమె కుమార్తెకు కరోనా'
  4. బిగ్​బీ అమితాబ్​ కుటుంబం త్వరగా కోలుకోవాలని పలువురు సినీ, క్రీడాప్రముఖులు సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధాన ఆలయాల్లో అభిమానులు.. పూజలు, హోమాలు సైతం చేయిస్తున్నారు. -'మీరు త్వరగా కోలుకోవాలి అమితాబ్​'
  5. అమితాబ్ ఇంటి దగ్గర శానిటైజేషన్​ చేసి, ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్. బిగ్​బీ ఇంటిని సీల్​ కూడా చేసింది. -కంటైన్మెంట్ జోన్​గా అమితాబ్ బచ్చన్ ఇంటి పరిసరాలు
  6. సీనియర్ నటి రేఖ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడం వల్ల ఆమె బంగ్లాకు అధికారులు సీల్ వేశారు. -నటి రేఖ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా.. బంగ్లా మూసివేత
  7. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్​ తల్లితో పాటు ఇతడి సోదరుడి ఇంట్లో ముగ్గురికి కరోనా సోకింది. అనుపమ్​కు మాత్రం నెగిటివ్​గా తేలింది. -అనుపమ్ ఖేర్ తల్లితో పాటు సోదరుడి కుటుంబానికి కరోనా
  8. తనకూ ప్రాణాంతక కరోనా సోకిందని ధ్రువీకరించింది ముంబయికి చెందిన మోడల్, నటి రేచల్ వైట్. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్​లో ఉన్నట్లు స్పష్టం చేసింది.
  9. రణ్​బీర్ కపూర్​తో పాటు ఆమె తల్లి నీతూ కపూర్​కు కరోనా సోకిందనే వార్తలపై స్పందించిన రణ్​బీర్ రిద్దిమా కపూర్.. తాము ఆరోగ్యంగానే ఉన్నామని తెలిపింది. అసత్య వార్తలు ప్రచారం చేయొద్దని కోరింది. -'రణ్​బీర్​, హేమమాలినికి కరోనా లేదు.. పుకార్లు ఆపండి'
  10. బాలీవుడ్​ సీనియర్ నటి హేమామాలిని.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడమనేది నిరధారమైన వార్త అని కొట్టి పారేసింది ఆమె కుమార్తె ఇషా దేఓల్.
  11. బాలీవుడ్​కు చెందిన ప్రముఖులు ఆమిర్​ఖాన్​, కరణ్​ జోహర్​, బోనీ కపూర్​లు తమ సిబ్బందికి వైరస్​ సోకినట్లు ఇటీవలే వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.