మెగా హీరో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్‌లుక్, టైటిల్‌ను శుక్రవారం(ఆగస్టు 20) ఉదయం 10:15 గంటలకు విడుదల చేయనున్నట్లు దర్శకుడు క్రిష్ ట్వీట్ చేశారు. ఇందులో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటించింది. 'కొండపొలం' నవల ఆధారంగా తీసిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి బాణీలు సమకూర్చారు. నవల టైటిల్‌నే సినిమాకు పెట్టనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
-
Title & First Look of @FirstFrame_ent #Production8 a spectacular adventurous film of Mega Sensation #PanjaVaisshnavTej, electrifying @Rakulpreet n our masterly team #Sannapureddi @mmkeeravaani @gnanashekarvs is out on Aug 20th, 10:15AM@YRajeevReddy1 #JSaiBabu @MangoMusicLabel pic.twitter.com/0JRlPr6OaQ
— Krish Jagarlamudi (@DirKrish) August 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Title & First Look of @FirstFrame_ent #Production8 a spectacular adventurous film of Mega Sensation #PanjaVaisshnavTej, electrifying @Rakulpreet n our masterly team #Sannapureddi @mmkeeravaani @gnanashekarvs is out on Aug 20th, 10:15AM@YRajeevReddy1 #JSaiBabu @MangoMusicLabel pic.twitter.com/0JRlPr6OaQ
— Krish Jagarlamudi (@DirKrish) August 18, 2021Title & First Look of @FirstFrame_ent #Production8 a spectacular adventurous film of Mega Sensation #PanjaVaisshnavTej, electrifying @Rakulpreet n our masterly team #Sannapureddi @mmkeeravaani @gnanashekarvs is out on Aug 20th, 10:15AM@YRajeevReddy1 #JSaiBabu @MangoMusicLabel pic.twitter.com/0JRlPr6OaQ
— Krish Jagarlamudi (@DirKrish) August 18, 2021
ఇటీవల షూటింగ్లో గాయపడి శస్త్రచికిత్స చేయుంచుకున్న ప్రకాశ్ రాజ్.. మళ్లీ సెట్స్‌కు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ కోసం గ్వాలియర్ చేరుకున్నట్లు పేర్కొన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తి, విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
-
BACK to work .. landed in Gwalior with #Maniratnam sir @Karthi_Offl on our way to Orchha for #PonniyinSelvan .. pic.twitter.com/0RjfonSc4l
— Prakash Raj (@prakashraaj) August 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">BACK to work .. landed in Gwalior with #Maniratnam sir @Karthi_Offl on our way to Orchha for #PonniyinSelvan .. pic.twitter.com/0RjfonSc4l
— Prakash Raj (@prakashraaj) August 18, 2021BACK to work .. landed in Gwalior with #Maniratnam sir @Karthi_Offl on our way to Orchha for #PonniyinSelvan .. pic.twitter.com/0RjfonSc4l
— Prakash Raj (@prakashraaj) August 18, 2021
హాస్యనటుడు పార్వతీశం హీరోగా నటించిన 'సావిత్రి w/o సత్యమూర్తి' టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఇందులో పార్వతీశంకు జోడీగా సీనియర్ నటి శ్రీలక్ష్మి నటించారు. '20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల మహిళ భార్య అయితే ఎలా ఉంటుంది?' అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తీశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సుధీర్‌బాబు 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా ట్రైలర్ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు దీనిని లాంచ్ చేయనున్నారు.
రెజీనా కొత్త సినిమాకు 'నేనే నా?!' టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్ బుధవారం విడుదల చేశారు. కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ సినిమా 'భూత్ పోలీస్'. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇందులో యామీ గౌతమ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. సెప్టెంబరు 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అక్షయ్‌కుమార్ 'బెల్ బాటమ్' థియేటర్లలోకి గురువారం రానుంది. ఈ చిత్రంలో అక్షయ్ అండర్‌కవర్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రంజిత్ తివారీ దర్శకత్వం వహించారు.
ఇదీ చదవండి : పెళ్లి జరిగిన చోటే సమంత డ్రీమ్‌హౌస్!