చిత్రసీమలో రాణించాలంటే ఏ నటీనటులకైనా నటనలో ప్రావీణ్యం ముఖ్యం. ఆధునిక కాలంలో దానితో పాటు డ్యాన్స్‌లోనూ టాలెంట్ ఉన్న వారికే సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. అయితే నృత్యంలోని క్లాసికల్, వెస్ట్రన్, సాల్సా, ఫోక్‌తో సహా బెల్లీ డ్యాన్స్‌పైనా హీరోయిన్లు పట్టుతెచ్చుకుంటున్నారు.
కొత్త కొత్త డ్యాన్స్‌లను నేర్చుకుంటూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో అభిమానులతో పోస్ట్ చేస్తున్నారు పలువురు బాలీవుడ్ హీరోయిన్లు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బెల్లీ డ్యాన్స్‌తో నెటిజన్లను అలరించిన వారిలో కొంతమంది తారల గురించి ఈ కథనం.
1. దేవోలీనా భట్టాచార్జీ
బుల్లితెరలో అనేక కార్యక్రమాలతో పాటు ధారావాహికల్లోనూ నటించి హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది నటి దేవోలీనా భట్టాచార్జీ(Devoleena Bhattacharjee). గతంలో పలు డ్యాన్స్ షోల్లోనూ పాల్గొంది. డ్యాన్స్‌పై ఎంతో ప్రేమ ఉన్న ఈమె.. ఇన్‌స్టాలో చాలాసార్లు డ్యాన్స్ వీడియోలను అప్లోడ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ బెల్లీ డ్యాన్స్ మూమెంట్ వీడియో షేర్ చేయగా.. దానికి విశేష స్పందన లభిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
2. సనయా కపూర్
నటుడు సంజయ్ కపూర్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్‌కు పరిచయమైన సనయా కపూర్(Shanaya Kapoor).. సినిమాల్లోకి రాకముందే నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఈ నేపథ్యంలో తాను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చాలా వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది. ఇటీవలే ఓ బెల్లీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేయగా.. దానికి నెటిజన్ల నుంచి బాగా రెస్పాన్స్ వస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
3. జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది జాన్వీకపూర్(Janvhi Kapoor). తొలి సినిమా 'ధడక్'తోనే నటిగా నిరూపించుకుంది. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉండే ఈ భామ.. తరచుగా తన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. షారుక్ ఖాన్ 'అశోకా' చిత్రంలోని 'సన్ సననా' పాటకు బెల్లీడాన్స్ చేస్తున్న పాత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
4. నియా శర్మ
బాలీవుడ్ నటి నియా శర్మ(Nia Sharma) ఎంత గొప్ప డ్యాన్సరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్‌మీడియాలో తరచుగా డ్యాన్స్ వీడియోలను షేర్ చేసే ఈ భామ.. ఇటీవలే తన స్నేహితులరాలితో కలిసి చేసిన బెల్లీ డ్యాన్స్(Nia Sharma belly dance) అభిమానులను అలరిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
5. రష్మీ దేశాయ్
బాలీవుడ్లో జాన్ అబ్రహం ప్రధానపాత్రలో నటించిన 'సత్యమేవ జయతే' చిత్రంలోని 'దిల్బర్' సాంగ్‌కు బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టింది నటి రష్మీ దేశాయి(Rashami Desai belly dance). ఆమె డ్యాన్స్‌కు అభిమానులు తెగ ఫిదా అయిపోతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. నోరా ఫతేహి
బెల్లీ డ్యాన్స్‌లో బాలీవుడ్ నటి నోరా ఫతేహి(Nora Fatehi) తక్కువేం కాదు. తన నడుము కదలికలతో కుర్రకారును ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి తన బెల్లీ డ్యాన్స్‌తో(Nora Fatehi belly dance) అభిమానులను అలరిస్తోందీ ముద్దుగుమ్మ. ఆ వీడియో మీరు చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి.. బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ కపూర్