ETV Bharat / sitara

ఎన్నేళ్లైనా తరగని అందం.. షక‌లక బేబి సొంతం! - సుస్మితా సేన్​ పుట్టినరోజు

హీరోయిన్ సుస్మితాసేన్.. మిస్​ యూనివర్స్​ నుంచి హీరోయిన్​గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..

sushmitha sen
సుస్మిత సేన్​
author img

By

Published : Nov 19, 2021, 5:30 AM IST

"మరణించే‌లోపు కొద్ది‌మంది జీవి‌తా‌లనైనా మనం ప్రభావితం చేయాలి. జీవి‌తా‌నికి అర్థం, పర‌మార్థం అంటే అదే" అని చెబు‌తుంటుంది నటి సుస్మితాసేన్. మిస్​ యూనివర్స్​గా నిలిచి.. ఆపై సినిమాల్లో రాణించి, ప్రస్తుతం తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తోందీ భామ. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

అందాల కిరీటాన్ని గెలు‌చు‌కొన్న భామలు ఎంతో‌మంది ఉన్నారు. వారిలో హీరోయిన్​గా తెర‌పైకి అడు‌గు‌పెట్టి రాణి‌స్తు‌న్న‌వాళ్లూ చాలా‌మందే కని‌పి‌స్తారు. ఐదు పదుల వయసుకు చేరు‌వ‌వుతున్నా.. ఇప్ప‌టికీ ఆమెకు నట‌నపై మోజు తగ్గ‌లేదు. 2015లో 'నిర్‌బాక్‌' చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది.

హైద‌రా‌బాద్‌ అమ్మాయే

సుస్మితా మూలాలు బంగాల్​లో ఉన్నాయి. పుట్టి పెరి‌గింది మాత్రం హైద‌రా‌బాద్‌లోనే. తండ్రి సుభేర్​సేన్‌ భారత వాయుదళంలో వింగ్‌ కమాండర్‌గా పని‌చే‌సే‌వారు. ఉద్యో‌గ‌రీత్యా హైద‌రా‌బాద్‌లో స్థిరపడ్డారు. తల్లి శుభ్రాసేన్‌ ఆభ‌ర‌ణాల డిజై‌నర్‌. సుస్మి‌తాకు నీలమ్, రాజీవ్‌ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.

తొలి కిరీటం

పది‌హే‌నేళ్ల వయ‌సు‌లోనే అందాల ప్రపం‌చంతో అను‌బంధం ఏర్ప‌రు‌చుకొంది. స్కూల్‌లో ఉన్నప్పుడే బ్యూటీ కాంటె‌స్ట్‌ల్లో పాల్గొ‌నేది. ఆ తర్వాత 1994లో మిస్‌ యూని‌వ‌ర్స్‌గా నిలి‌చింది. ఆ కిరీ‌టాన్ని దక్కించుకొన్న తొలి భార‌తీయ యువ‌తిగా రికార్డు సృష్టిం‌చింది.

sushmitha sen
సుస్మిత సేన్​

'దస్‌త‌క్‌'తో

మిస్‌ యూని‌వర్స్‌ కిరీ‌టం సాధించిన తర్వాత 'దస్‌త‌క్‌' అనే బాలీవుడ్​ సినిమాతో కెరీ‌ర్‌ ప్రారం‌భించింది. ఆ చిత్రం అంతగా పేరు తీసు‌కు‌రా‌లే‌దు. నాగా‌ర్జు‌నతో చేసిన 'రక్ష‌కుడు'.. అను‌కొ‌న్నంత ఆద‌రణ పొంద‌లేదు. అయినా సుస్మి‌తా‌సేన్‌ పేరు మాత్రం మార్మో‌గి‌పో‌యింది.

హిందీలో హవా

సుస్మి‌తా‌సే‌న్‌కు గుర్తింపు తీసు‌కొ‌చ్చిన చిత్రం 'సిర్ఫ్‌తుమ్‌'. 1999లో విడు‌ద‌లైన ఈ సినిమా... సుస్మి‌తా‌సే‌న్​కు గుర్తింపు తీసుకొచ్చింది. కొన‌సా‌గింపుగా వచ్చిన 'బివి నెం.1' కూడా విజ‌య‌వంతమైంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అవే నిల‌బె‌ట్టాయి

'ఆంఖే', 'మై హూనా', 'పైసా వసూల్‌', 'మైనే ప్యార్‌ క్యోకియా','ఫిల్హాల్‌', 'సమయ్‌', 'చింగారి', 'జిందగీ రాక్స్‌', 'ఆగ్‌', 'డు నాట్‌ డిస్టర్బ్‌', 'నో ప్రాబ్లెమ్‌' తది‌తర చిత్రాలు సుస్మి‌తాను నటిగా నిల‌బె‌ట్టాయి.

ఐటెమ్‌ అదుర్స్‌

షక‌లక బేబి.. షక‌లక బేబి... లుక్కు‌లివ్వ తోచ‌లేదా? అంటూ 'ఒకేఒ‌క్క‌డు'లో సుస్మి‌తా‌సేన్‌ చేసిన సంద‌డిని తెలుగు ప్రేక్షకులు ఇప్ప‌టికీ మరి‌చి‌పో‌లేదు. ఆ తరహా పాట‌లతో హిందీలోనూ సందడి చేసింది. ఆమె చేసిన ప్రత్యే‌క‌గీతాలు విశే‌షంగా ప్రాచుర్యం పొందాయి.

sushmitha sen
సుస్మిత సేన్​

పెళ్లి కాకుండా తల్లి

సుస్మిత ఎంత అందమో... ఆమె హృదయం అంత‌కంటే అంద‌మై‌న‌దని చెప్పొచ్చు. 25 యేళ్ల వయ‌సులో రెనీ అనే ఓ చిన్నా‌రిని దత్తత తీసుకొంది. పెళ్లి చేసు‌కోని మహిళ.. పిల్ల‌లను సంర‌క్షిం‌చ‌లేదన్న అభ్యం‌తరం రావ‌డంపై న్యాయ‌స్థానంలో పోరాటం చేసింది. అందులో గెలిచి పాపని దత్తత తీసు‌కొంది. ఇప్పటికీ అదొక చరి‌త్రగా చెబు‌తుం‌టారు. 2010లోనూ అలిషా అనే మరో చిన్నా‌రిని కూడా దత్తత తీసు‌కొంది.

లేటు వయసులో ఘాటు ప్రేమ

ఈ విశ్వసుందరి లేటు వయసులో ఘాటు ప్రేమాయణానికి తెరలేపింది. తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోషన్‌తో షాల్‌తో చెట్టాపట్టాలేసుకోని తిరుగుతోంది. వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సుస్మిత తన మన‌సులోని మాటల్ని వివిధ సంద‌ర్భాల్లో ఇలా వెల్ల‌డిం‌చింది.

  • నా జీవి‌తంలో మరి‌చి‌పో‌లేని విష‌యాలు చాలానే ఉన్నాయి. అయితే వాట‌న్ని‌టి‌కంటే నేను తల్లిని అయిన క్షణమే నాకు ఎప్పటికీ గుర్తుం‌టుంది. రెనీను నాకు అప్ప‌జె‌బుతూ కోర్టు తీర్పు‌ని‌చ్చిన సమయంలో నా సంతో‌షా‌నికి ఆకా‌శమే హద్దు.
  • తల్లి‌న‌య్యాక నాలో చాలా మార్పొ‌చ్చింది. రెనీ నా జీవి‌తంలోకి రాగానే నాకు నేనుగా చాలా నిర్ణ‌యాలు తీసు‌కొన్నా. ప్రతి విష‌యంలోనూ జాగ్రత్తగా, బాధ్య‌తగా వ్యవ‌హ‌రిం‌చా‌లనీ, ర్యాష్‌ డ్రైవింగ్‌ల్లాంటివి అస్సలు చేయ‌కూ‌డ‌దని నిర్ణ‌యించు‌కొన్నా. ఇప్పటికీ అదే రకం‌గానే జీవి‌తాన్ని గడుపు‌తున్నా.
  • నాకు బీచ్‌లంటే చాలా ఇష్టం. అందుకే దక్షిణ అమె‌రికా దేశాలకు తర‌చుగా వెళు‌తుంటా. ముఖ్యంగా వెని‌జులా, బ్రెజిల్‌లకు ఎన్ని‌సార్లు వెళ్లానో నాకే తెలి‌యదు. అక్కడ నగ‌రాలు చాలా విశా‌లంగా ఉంటాయి.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • నాకు రాత్రిళ్లు మేలు‌కొనే అల‌వాటు ఎక్కువ. అలా‌గని పబ్బులు, పార్టీ‌లకు వెళ్లను. ఇంట్లోనే గడుపు‌తుంటా. మనసు కాస్త తేడాగా ఉంద‌ని‌పిస్తే.. గట్టిగా మ్యూజిక్‌ పెట్టు‌కొని డ్యాన్స్‌ వేస్తూ స్వాంతన పొందు‌తుంటా.
  • శృంగారం గురించి మాట్లా‌డు‌కో‌వ‌డా‌నికి ఇప్ప‌టికీ భయ‌ప‌డుతుం‌టారు. అదేంటో అర్థం కాదు. కామ‌సూత్ర మన దేశం‌లోనే పుట్టింది. కానీ ఇప్ప‌టికీ మనవాళ్లు ఆ విష‌యంలో రహ‌స్యాలు పాటిస్తున్నారు. శృంగారం గురించి అంద‌రికీ అవ‌గా‌హన ఏర్ప‌డాలి. మీడియా వల్ల ఇటీ‌వల కొద్ది‌మం‌దైనా మాట్లా‌డు‌కొంటుండడం సంతో‌షా‌న్ని‌స్తోంది.

ఇదీ చూడండి: పాయల్​ అందాల విందు.. మత్తెక్కిస్తున్న మాళవిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.