సినీ పరిశ్రమలోని చాలామంది తారలు ఎలాంటి నేపథ్యంలో లేకుండా వచ్చినవారే! అలాంటి వాళ్లు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించి.. కొద్దికాలంలోనే స్టార్లుగా ఎదుగుతున్నారు.
హీరోయిన్గా టాప్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు వీడ్కోలు చెప్పినవారు కొందరైతే.. వివాహానికి, నటన రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ సాగిస్తున్నవారు మరికొందరు. అయితే అందులో ఎక్కువమంది కథానాయికలు బిజినెస్మ్యాన్లనే పెళ్లి చేసుకోవడం విశేషం. అలా చిత్రసీమలో పారిశ్రామికవేత్తలతో ఒక్కటైన తారలు ఎవరో చూద్దాం.
కాజల్ అగర్వాల్
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_22.jpg)
ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబరులో వివాహం చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పింది. తెలుగులో ప్రస్తుతం 'ఆచార్య', 'మెసగాళ్లకు మోసగాళ్లు' చిత్రాల్లో నటిస్తోంది.
శిల్పాశెట్టి
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_2.jpg)
లండన్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను 2009లో శిల్పాశెట్టి వివాహామాడింది. 2012లో వీరికి అబ్బాయి వయాన్ కుంద్రా జన్మించాడు. గతేడాది అమ్మాయి షమీషా శెట్టి కుంద్రా పుట్టింది.
అమృతా అరోరా
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_3.jpg)
బాలీవుడ్ నటి అమృత అరోరా.. వ్యాపారవేత్త షకీల్ లడఖ్‌ను 2009 మార్చి 4న పెళ్లి చేసుకుంది. తల్లి మలయాళీ కేథలిక్, తండ్రి పంజాబీ కావడం వల్ల ఈ రెండు సంప్రదాయలతో పాటు తన భర్త ముస్లిం కావడం వల్ల ఇస్లాం సంప్రదాయంలో.. అంటే మూడు సంస్కృతులను గౌరవిస్తూ షకీల్‌ను మూడుసార్లు అమృత పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.
కరిష్మా కపూర్
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_karishma.jpg)
ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్‌ను కరిష్మా వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు.
రీమా సేన్
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_reema-sen.jpg)
బాలీవుడ్ నటి రీమాసేన్ దిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త శివ కిరణ్ సింగ్‌ను 2012లో పెళ్లి చేసుకుంది. పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. రీమాసేన్ దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఊర్వశీ శర్మ
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_urvashi-sharma.jpg)
జేఎంజే గ్రూప్ ఆఫ్ హోటల్స్, నిర్మాణ సంస్థలు, మినరల్ వాటర్, టిష్యూస్, జిమ్, స్పా, ఎనర్జీ డ్రింక్ లాంటి వ్యాపారాలు చేస్తున్న నటుడు, పారిశ్రామికవేత్త సచిన్ జోషిని ప్రేమించి, 2012లో పెళ్లి చేసుకుంది నటి ఊర్వశి శర్మ.
జూహీ చావ్లా
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_juhi.jpg)
మల్టీ-మిలియనీర్, పారిశ్రామికవేత్త జై మెహతాను 1998లో జూహి వివాహమాడారు. వీరికి కుమార్తె జాన్వీ, కుమారుడు అర్జున్ ఉన్నారు.
కిమ్ శర్మ
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_kim.jpg)
వ్యాపారవేత్త అలీ బద్రుదిన్ పంజనిని వివాహం చేసుకున్న నటి కిమ్‌శర్మ.. కెన్యాలో స్థిరపడింది. కెన్యాలోని అత్యంత ధనవంతుల్లో అలీ ఒకరు. ఆయనకు హోటల్, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, రవాణాలో వ్యాపారాలు ఉన్నాయి. కెన్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, దక్షిణాప్రికా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అతడికి అస్తులు ఉన్నాయి.
ఆయేషా టాకియా
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_ayesha-takia.jpg)
రాజకీయ నాయకుడు అబు అజ్మి కుమారుడు ఫరాన్ అజ్మిని 2009లో ఆయేషా టాకియా వివాహమాడింది. ఫరాన్‌కు ముంబయిలో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి.
రవీనా టాండన్
![Bollywood actresses married to famous businessmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10586717_raveena.jpg)
సినిమాల పంపిణీదారుడు అనిల్ తడానిని బాలీవుడ్ నటి రవీనా టాండన్ పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత పలు సినిమాల్లో నటిస్తున్న ఈమె.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
ఇవీ చూడండి:
టాలీవుడ్లో రూపొందిన ఉత్తమ ప్రేమకథా చిత్రాలు!
ఒకటి కాదు.. అంతకుమించిన చిత్రాలతో సిద్ధం!
సినిమాలే కాదు దైవభక్తీ ముఖ్యమే!
చిన్నప్పుడే హీరోయిన్గా ఎంపికై.. ప్రేక్షకులకు దగ్గరై