"కొన్ని కథలు మనల్ని వెంటనే ఆకర్షిస్తాయి. వినగానే చేయాలనిపిస్తాయి. అలాంటి కథల్లో ఒకటి 'శకుంతల దేవి" అని చెబుతోంది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఆమె ఎక్కువగా బయోపిక్‌లు, వాస్తవ కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటుంది. తాజాగా 'శకుంతల దేవి'లో నటింటింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
"దర్శకురాలు అనూమేనన్ నా దగ్గరికి వచ్చి నేను శకుంతల దేవి జీవిత చరిత్రను తెరకెక్కించాలనుకుంటున్నట్లు చెప్పింది. అప్పటికే ఆ గణిత శాస్త్రవేత్త గురించి నాకు తెలుసు. నాకు ఆసక్తి పెరిగింది. ఆమె గిన్నిస్ రికార్డు సాధించింది. ఎన్నో పుస్తకాలు రచించింది. హోమోసెక్సువాలిటీ మీద పుస్తకం రాసి సాహసం చేసింది. ఇవన్నీ రెండు గంటల సినిమాలో చూపించబోతున్నాం. మేం కొన్ని నిజాలను స్వేచ్ఛ తీసుకొని సృజనాత్మకంగా చూపించాం."
విద్యాబాలన్, సినీ నటి
మీరు లెక్కలు చాలా వేగంగా చేయగలరా అని ఒకరు అడగ్గా.. "ఇప్పుడు ఎవరూ మెదడుతో లెక్కలు చేయడం చేయడంలేదు. ప్రతిదాన్ని ఫోన్‌తోనే చేస్తున్నారు. నేను ఈ సినిమాను ఆస్వాదించా. చాలా సంఖ్యలు, కిటుకులు వేద గణితం వంటివి నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి గణితంలో ఫర్వాలేదు." అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.
ఈ సినిమా జులై 31న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">