ETV Bharat / sitara

నెటిజన్ల కామెంట్లపై సోనాక్షి ఘాటు జవాబు

author img

By

Published : Oct 31, 2019, 5:31 AM IST

బాలీవుడ్‌లో అందాల బొద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న నటి సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు స్టార్​ హీరో సల్మాన్​ సరసన 'దబాంగ్​ 3'లో మళ్లీ ఛాన్స్​ కొట్టేసింది. ఈ సినిమా కోసం దాదాపు 30 కిలోలు తగ్గింది. అయితే గతంలో తన ఆకారంపై విమర్శలు చేసిన కొందరికి ఘాటుగా జవాబిచ్చింది.

'నా ఆకారం స్కేలు పైన ఉండే నంబర్​ కాదు'

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా... కెరీర్‌ ఆరంభంలో చాలా బరువుండేది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్ల చాలా కసరత్తులు చేసి దాదాపు 30 కిలోలకు పైగా తగ్గింది. అయితే ఇప్పటికీ ఆమె ఆకారంపై సోషల్‌మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తుంటే... మరికొందరు దారుణంగా తిడుతున్నారట. తాజాగా ఈ అమ్మడు తన రూపురేఖల గురించి హేళనగా మాట్లాడిన నెటిజన్ల నోర్లు మూయించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 'బిగ్గర్‌ దెన్‌ దెమ్' పేరుతో ఓ వీడియోను షేర్‌ చేసింది.

bollywood actress sonakshi sinha revealed a video about her body weight
సోనాక్షి... అప్పట్లో అలా.. ఇప్పుడు ఇలా

స్ఫూర్తి నింపేలా...

ఈ వీడియోలో ఐదేళ్లుగా నాకు ఎదురైన పరిస్థితిలో మార్పు రాలేదని చెప్పిన ఆమె... 'ఆవు క్యాట్‌వాక్‌ చేస్తోంది.. ఆంటీ జీ.. ఏనుగు.. ఫాట్‌సో' ఇలా నెటిజన్లు తనను విమర్శించిన పదాలతో వీడియోను విడుదల చేసింది.

" సోషల్‌మీడియాలో ఇలా పిలిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఓసారి ఊహించండి. మీకు అనిపించిన దాన్ని ఇక్కడ పోస్ట్‌ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నారా?.. వీటినే ట్రోల్స్‌ అంటుంటారు కదా. ఎలాంటి పని ఉండదు కాబట్టి వీరికి ఇతరుల్ని జడ్జ్‌ చేసేందుకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఎలాగైనా, ఏమైనా మాట్లాడతారు.. మేం వినాలి. కొన్నిసార్లు మాకు కోపం వస్తుంది. కొన్నిసార్లు బాధపడుతుంటాం. కానీ ఇప్పుడు నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు జోకర్లతో సమానం. నేను చాలా విన్నా. బాధపడ్డా. 30 కిలోల బరువు తగ్గినప్పటికీ నా గురించి అలానే మాట్లాడుతున్నారు. అందుకే వారిని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నా"
-- సోనాక్షి సిన్హా, బాలీవుడ్​ నటి

  • Let’s talk about the elephant in the room!

    For years I’ve been trolled because of my weight. I’ve never felt the need to react because I always believed i was #BiggerThanThem... pun intended. But on the next episode of @MyntraFS I asked the contestants to take to social media, pic.twitter.com/wvu1P9OY2o

    — Sonakshi Sinha (@sonakshisinha) October 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తన బరువు, ఆకారం.. దాచుకోవాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చిన సోనాక్షి... 'నేనేమి స్కేల్‌పైన ఉండే నెంబర్‌ను కాదు' అని ఘాటుగా సమాధానమిచ్చింది.

ప్రస్తుతం 'దబాంగ్‌ 3'లో నటిస్తోంది సోనాక్షి. కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా... డిసెంబరు 20న విడుదల కాబోతోంది. వీటితో పాటు అజయ్‌ దేవగణ్, సంజయ్‌దత్‌లతో కలిసి 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా'లో సుందర్‌బెన్‌ జీతాగా కనువిందు చేయనుంది.

New Delhi, Oct 30 (ANI): While being taken to Tihar Jail, Congress leader P Chidambaram spoke on the delegation of European Union (EU) MPs which visited Jammu and Kashmir yesterday. He said, "European MPs may be invited to attend Parliament and speak in favour of the government. Who knows? It may happen." The delegation of European Union MPs visited Kashmir to assess the situation in the state. After visiting the state, they backed Centre's move on Article 370.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.