బాలీవుడ్ నటి మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. నూతన సంవత్సరం సందర్భంగా తన ప్రియుడు, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు ముద్దిచ్చిన ఫొటోను షేర్ చేయడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు ఎన్నో వేడుకల్లో జంటగా కనిపించిన ఈ జోడీ.. వారి ప్రేమాయణంపై మాత్రం అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కానీ తాజా ఫొటోతో.. అభిమానులు వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని భావిస్తున్నారు. ఇటీవల అర్జున్ కుటుంబాన్ని మలైకా కలవడం వెనుక రహస్యం ఇదే అని కామెంట్లు పెడుతున్నారు.
మలైకా 1998లో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు.. అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2017లో విడాకులు తీసుకుంది. వీరు విడిపోవడానికి అర్జున్ కారణమని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మోడల్ జార్జియా ఆండ్రియానితో అర్బాజ్ డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అర్జున్ కపూర్ కంటే మలైకా దాదాపు పన్నెండేళ్లు పెద్దది కావడం విశేషం.