ఇప్పటికీ నన్ను తెలుగు వారు 'ప్రేమపావురాలు' నాయికగా గుర్తుంచుకున్నారు. ప్రభాస్ నటనకు పెద్ద అభిమానిని. అందుకే ప్రభాస్ సినిమాను అంగీకరించాను. అతడు ఎంత ఎదిగినా వినయంగా ఉంటాడు. ఇద్దరం ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. తొలిరోజు నేను సెట్‌కు వెళ్లగానే నన్ను చూసి ఎదురొచ్చాడు. తను నాకు అభిమాని అని చెప్పాడు. ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటే... ఇన్నేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఉద్వేగంగా ఉంది.
రాజవంశీకుల కుటుంబంలో పుట్టిన నాకు అమెరికాలో ఉన్నత విద్య చదవాలని ఉండేది. మా పక్కింట్లో ఉండే బాలీవుడ్ దర్శకుడు అమోల్ పాలేకర్ తాను తీస్తున్న ఓ టీవీ సీరియల్‌లో ప్రధాన పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్నారు. అలా నటినయ్యా.
అయిష్టంగానే 'మైనే ప్యార్ కియా' ఒప్పుకున్నా. అయితే అదే నా జీవితాన్ని మార్చేసింది. అప్పట్లో సినిమాల్లో నటించడం నాకు ఇష్టముండేది కాదు. అమెరికాలో చదువుకోవాలన్న లక్ష్యం దెబ్బతింటుందని భయపడేదాన్ని. ఆ చిత్ర దర్శకుడు సూరజ్ బర్జాత్యా నాన్నకు స్నేహితుడు. సల్మాన్ ఖాన్‌కు నాయికగా నేనైతే బాగుంటుందని అనుకున్నారట. నాన్నను ఒప్పించగలిగారు కానీ నేను ఇష్టపడలేదు. అయినా సూరజ్‌గారు ప్రయత్నించడం మానలేదు. దీంతో ఈ చిత్రం నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచించా. ఆయనను కథంతా చెప్పమనేదాన్ని. ఆ తర్వాత ఫలానా సీన్ బాగోలేదు. మారిస్తే మంచిది అనేదాన్ని. ఆయన మరో రోజు ఆ సీన్‌ను మార్చి తీసుకొచ్చేవారు. తిరిగి నేను మరో సీన్‌ను మార్చమనేదాన్ని. అలా ఏడుసార్లు ఆ సినిమాను తిరస్కరించడానికి ప్రయత్నించా. చివరికి వేరే దారిలేక ఒప్పుకొన్నా.
తొలి సినిమా ఘన విజయం సాధించాక మరికొన్ని చిత్రాల్లో నటించా. అయితే అన్నింటి కన్నా నేను ఎక్కువగా ప్రేమించిన చిన్నప్పటి స్నేహితుడు హిమాలయ దసానీని పెళ్లిచేసుకుని తెరకు దూరమయ్యా. ఒక బాబు, పాపతో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 'భాగ్యశ్రీ స్కీం' ప్రాజెక్టు ప్రచారకర్తగా బాలికల చదువు ప్రాముఖ్యత గురించి ప్రచారం చేయడం సంతృప్తినిచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: భాగ్యశ్రీ ప్రత్యేకం: ప్యార్ కియా.. అభిమానుల గుండె లయ