ETV Bharat / sitara

తారలకు విరామం దొరికితే ఇలా ఉంటుంది! - కత్రినా కైఫ్ న్యూస్​

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పలు సినిమా షూటింగ్​లు రద్దయ్యాయి. దీంతో తాత్కాలికంగా సెలవు దొరకటం వల్ల తారలు వారికి నచ్చిన వ్యాపకాలపై దృష్టి సారించారు. బాలీవుడ్​కు చెందిన కొందరు ప్రముఖులు వారు చేస్తున్న పనులను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

Bollywood actors who enjoy Corona holidays with their favorite habits
పుస్తకాలతో, పెంపుడు జంతువులతో కాలక్షేపం
author img

By

Published : Mar 19, 2020, 10:13 AM IST

ఇప్పుడు మన సినీ తారలందరికీ కరోనాతో విరామం దొరికింది. అలా ఖాళీ సమయం దొరికిందో లేదో ఒక్కొక్కరు ఒక్కో వ్యాపకంతో బిజీగా మారిపోయారు. ఒకరేమో పుస్తకాలతో జట్టు కడుతున్నారు.. మరొకరేమో ఫోన్‌తో దోస్తీ చేస్తున్నారు.. ఇంకొకరు స్నేహితులతో సేద తీరుతున్నారు.. ఇలా బాలీవుడ్‌ తారలు ఒక్కో పని ముందరేసుకున్నారు.. ఆ విశేషాలేంటో చూద్దామా.

పెంపుడు జంతువుతో..

ప్రియాంక చోప్రా దంపతుల ముద్దుల పెంపుడు జంతువు జీనో జెర్మన్‌ డాగ్‌. పెళ్లి రోజు కానుకగా తన భర్త నిక్‌ జోనాస్‌కు దీన్ని బహుమతిగా ఇచ్చిందీ భామ. తీరిక దొరికితే చాలూ ఎప్పుడూ దానితోనే వీరిద్దరు సరదాగా కాలక్షేపం చేస్తారు. కరోనా భయంతో ఇప్పుడు ఇంట్లోనే ఉండాల్సి రావడం వల్ల ప్రియాంక జీనోతో తెగ అల్లరి చేస్తోంది. అంతేకాదు.. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది.

"ఇంటి దగ్గరే ఉండటం ఇప్పుడు అత్యంత సురక్షితం. జీనో ఇచ్చే మమ్మీ హగ్గులతో నేను ఇంట్లో హ్యాపీగా ఉన్నా" అంటూ ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.

వార్డ్‌రోబ్‌ దుమ్ము దులుపుతూ..

దీపికా పదుకుణే తన వార్డురోబ్‌లోని దుస్తులను విక్రయించి తను స్థాపించిన 'ది లివ్‌, లవ్‌, లాఫ్‌' ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చుకుంటుంది. ప్రస్తుతం ఈ 'పద్మావత్‌' యువరాణి ఆ పనిలోనే పడ్డట్టుంది. కరోనా సెలవులు రావడం వల్ల ఖాళీగా ఉండటం ఎందుకని తన వార్డురోబ్‌ను మొత్తం శుభ్రం చేసేసింది. తన వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇస్తోంది. వీటి గురించి చెబుతూ "కొవిడ్‌19 సమయంలో ఇదే నా ఉత్పాదకత" అంటూ ఇన్‌స్టాలో చిత్రాలు పోస్ట్‌ చేస్తోంది. పిజ్జాను తనకు నచ్చినంత చీజ్‌తో లాగించేస్తోంది. దీనికి సంబంధించిన మీమ్‌ను పోస్ట్‌ చేసింది.

పుస్తకాలు చదువుతూ..

ఇన్‌స్టాలో ఇటీవలే ఖాతా తెరిచింది కరీనా. అప్పటి నుంచి ఏదో ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంటూ అల్లరి చేస్తోందీ సుందరి. ఈ బ్రేక్‌లోనూ ఇన్‌స్టాలోనే సరదాగా గడుపుతోంది. ఆమె భర్త సైఫ్‌ మాత్రం పుస్తకాల పురుగుగా మారిపోయాడు. వచ్చే వారం రోజులు అతడు పుస్తకాలకే పరిమితం అవుతాడంటూ రాసుకొచ్చింది కరీనా. ఇక్కడితోనే ఆగిపోకుండా.. సైఫ్‌ తన స్టడీ రూంలో చాలా ఏకాగ్రతతో చదువుతున్న ఫొటో, తనూ ఫొన్లో మునిగితేలుతున్న చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది. ఫోన్‌తోనే సరిపెట్టుకోకుండా తనకు నచ్చిన ఆహారాన్ని తయారు చేసుకుని తింటోంది. ఘుమఘుమలాడే క్యారెట్‌ ప్యారిడ్జ్‌ను తింటూ.. "ఇది నా పొట్టలోకి వెళ్లదు. నేరుగా నా హృదయంలోకి వెళ్తుంది. నా హృదయం చాలా పెద్దది" అంటూ ఆ వంటకం ఎంత రుచిగా ఉందో చెప్పకనే చెప్పిందీ ముద్దుగుమ్మ.

కత్రినా కైఫ్​

ప్రస్తుతం 'సూర్యవంశీ' సినిమాలో నటిస్తోంది కత్రినా కైఫ్​. తాజాగా ఆ చిత్ర షూటింగ్​ రద్దవ్వటం వల్ల ఇంటికే పరిమితమైందీ భామ. ఈ క్రమంలో ఆమెకు ఇష్టమైన గిటార్​ను వాయిస్తూ కాలక్షేపం చేస్తోంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇదీ చూడండి.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తారలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.