ETV Bharat / sitara

భార్య ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూ సూద్‌! - ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూ సూద్

ఎంతోమంది వలస కూలీలను ఆదుకున్న నటుడు సోనూసూద్​.. తాజాగా నిరుపేదలకు సాయం చేసేందుకు రూ.10కోట్లు విలువైన ఆస్తులను తాకట్టు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆస్తి తన భార్య సోనాలికి చెందినదిగా తెలుస్తోంది.

Sonu Sood
సోనూ సూద్
author img

By

Published : Dec 9, 2020, 8:30 AM IST

లాక్​డౌన్​లో ఎంతో మంది వలస కార్మికులు, పేదలకు అండగా నిలిచారు ప్రముఖ నటుడు సోనూసూద్​. తన వంతు సాయం చేస్తూ వారిపాలిట ఆపద్భాందవుడు అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిరుపేదల కోసం పదికోట్ల రూపాయలు విలువ చేసే జూహూ ప్రాంతంలోని 6 ఫ్లాట్స్, మరో రెండు దుకాణాలను తాకట్టు పెట్టారని తెలిసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఒప్పందం సెప్టెంబరు 15న కాగా, నవంబరు 24న రిజిస్టర్​ చేశారని సమాచారం. అయితే ఈ తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ తన భార్య సోనాలికి చెందినవటా!

Sonu Sood
సోనూ సూద్

ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. సోనూ సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించినా, నిజజీవితంలో మాత్రం రియల్‌ హీరో అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెట్టి లైక్‌లు కొడుతున్నారు. ప్రస్తుతం సోనూ.. తెలుగులో 'అల్లుడు అదుర్స్', బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ 'పృథ్వీరాజ్‌' చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇదీ చూడండి : అభిమాని సాహసానికి 'సోనూ' కంటతడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.