బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యం బారిన పడ్డారు. ఉత్తరాఖండ్ ముస్సోరీలో ఓ సినిమా షూటింగ్లో ఉన్న ఆయనకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అక్కడే ఓ హోటల్లో ఉన్న ఆయనను వైద్యులు పరీక్షించారు. మిథున్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రీకరణ కోసం ముస్సోరీకి వెళ్లారు మిథున్. ఆయనతో పాటు అనుపమ్ ఖేర్ వంటి నటులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మిథున్ అనారోగ్యంగా ఉండడం వల్ల చిత్రీకరణకు హాజరు కాలేకపోతున్నారు. ముస్సోరీలో షెడ్యూల్ పూర్తైన తర్వాత దెహ్రాదూన్, రిషికేశ్కు వెళ్లనుందీ చిత్రబృందం.
ఇదీ చూడండి:''ఆచార్య'లో ఆ సీన్ రీషూట్ చేశాం'