బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. ఈరోజు ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం వల్ల అతడిని ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈయన... న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి కోసం విదేశాల్లోనూ చికిత్స తీసుకుని వచ్చారు. ఈ మధ్యనే తల్లి సయిదా బేగం రాజస్థాన్‌లో కన్నుమూసినా.. కడసారి చూపునకు నోచుకోలేకపోయారు ఇర్ఫాన్.

ఇటీవలే 'అంగ్రేజీ మీడియం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఇర్ఫాన్. 2018లో 'ఫజిల్' అనే హాలీవుడ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. అంతకుముందు తెలుగులోనూ మహేశ్ 'సైనికుడు' పప్పు యాదవ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు.